Coordinates: 22°27′10″N 69°05′05″E / 22.4526713°N 69.0847261°E / 22.4526713; 69.0847261

సుదర్శన్ సేతు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుదర్శన్ సేతు
డిసెంబరు 2021లో నిర్మాణంలో ఉన్న తీగల వంతెన
Coordinates22°27′10″N 69°05′05″E / 22.4526713°N 69.0847261°E / 22.4526713; 69.0847261
OS grid reference[1]
Carriesమోటారు వాహనాలు, పాదచారులు, సైకిళ్ళు
Crossesగల్ఫ్ ఆఫ్ కచ్, అరేబియన్ సముద్రం
Localeఓఖా, భారతదేశం - బేట్ ద్వారకా, గుజరాత్, భారతదేశం
Other name(s)ఓఖా - బేట్ ద్వారకా సిగ్నేచర్ సేతు
Characteristics
Designకేబుల్ వంతెన
Materialకాంక్రీటు, ఉక్కు
Total length2,320 metres (7,612 ft)
Width27.2 metres (89 ft)
Piers in water34
History
Constructed byఎస్ పి సింగ్లా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్
Construction start2017 అక్టోబరు 7
Construction end2023 డిసెంబరు 10
Opened2024 ఫిబ్రవరి 25
Location
పటం

సుదర్శన్ సేతు, దీనిని ఓఖా - బెట్ ద్వారకా సిగ్నేచర్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. ఈ వంతెన భారతదేశంలోనే అతి పొడవైన తీగల వంతెన. దీని పొడవు 2.32 కిలోమీటర్లు. దీనిని దాదాపు రూ.980 కోట్లతో నిర్మించారు. ఈ కేబుల్ వంతెన ఓఖా ప్రధాన భూభాగాన్ని సముద్రం మధ్యలో ఉన్న బేట్ ద్వారకతో అనుసంధానం చేస్తుంది. ఇది 2024 ఫిబ్రవరి 25న భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతప్రారంభించబడింది.[1]

చరిత్ర[మార్చు]

సుదర్శన్ సేతు వంతెన నిర్మాణానికి 2016లో కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపాడు.[2] ప్రధాని నరేంద్ర మోదీ 2017 అక్టోబరు 7న ఓఖా - బేట్ ద్వారక మధ్య వంతెనకు శంకుస్థాపన చేసాడు. దీనిని ₹979 కోట్ల వ్యయంతో నిర్మించారు.[3]

ఈ వంతెన ద్వీపంలో నివసిస్తున్న సుమారు 8500 మంది ప్రజలకు అలాగే అక్కడి దేవాలయాలను సందర్శించే సుమారు రెండు మిలియన్ల మంది యాత్రికులకు సేవలు అందిస్తుంది. దీనిని 2024 ఫిబ్రవరి 25న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించాడు.

విశేషాలు[మార్చు]

బెట్ ద్వారక ద్వీపాన్ని ఓఖా పోర్టుతో కలుపుతూ ఈ వంతెనను రూ.979 కోట్లతో నిర్మించారు. నాలుగు లేన్లు ఉన్న ఈ బ్రిడ్జి పొడవు 2.32 కిలోమీటర్లు, వెడల్పు 27.20 మీటర్లు.

సుదర్శన్ సేతు అనేది కేబుల్ బ్రిడ్జ్, ఫ్యాన్ అమరికలో కేబుల్స్, స్టీల్ పైలాన్‌లను ఉపయోగించి నిర్మించారు. డెక్ రెండు క్యారేజ్‌వేలతో కూడిన మిశ్రమ ఉక్కు-రీన్‌ఫోర్స్డ్ కాంక్రీటుతో తయారు చేయబడింది. వంతెన మొత్తం వెడల్పు 27.2 మీటర్లు, ప్రతి దిశలో రెండు లేన్‌లు, ప్రతి వైపు 2.5 మీటర్లు వెడల్పు ఫుట్‌పాత్. అలాగే, ఫుట్‌పాత్ షేడ్‌పై ఉన్న సోలార్ ప్యానెల్‌లు ఒక మెగావాట్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

మొత్తం పొడవు 2,320 మీటర్లు, కేబుల్ వంతెన 900 మీటర్లు పొడవైన సెంట్రల్ కేబుల్ విభాగాన్ని కలిగి ఉంది, ఇది భారతదేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జిగా నిలిచింది. ఇది 500 మీటర్ల పొడవాటి మిడిల్ స్పాన్‌తో మూడు స్పాన్‌లను కలిగి ఉంది. ఇరువైపులా ఉన్న ఇతర 3 స్పాన్‌లు 100 మీటర్ల పొడవు, 2 స్పాన్ 50 మీ. ఓఖా - బేట్ ద్వారక వైపున ఉన్న అప్రోచ్ వంతెనలు వరుసగా 770 మీటర్లు, 650 మీటర్ల పొడవును కలిగి ఉన్నాయి. వంతెనకు మద్దతిచ్చే రెండు ఆంగ్ల అక్షరం A-ఆకారపు కాంపోజిట్ పైలాన్‌లు 129.985 మీటర్ల పొడవు, 300మీ వ్యాసార్థం పైలాన్ మధ్యలో నుండి 22మీ వరకు బ్యాక్‌స్పాన్‌లో వంగి ఉంటాయి. రహదారి మొత్తం పొడవు 2.8 కిలోమీటర్లు ఉంటుంది.

ఈ వంతెనకు ఇరువైపులా భగవద్గీతలోని శ్లోకాలు, శ్రీకృష్ణుని చిత్రాలతో అలంకరించబడిన నడక మార్గం ఉంది.

మూలాలు[మార్చు]

  1. "సుదర్శన్‌ సేతును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! | Prime Minister Modi dedicated Sudarshan Sethu to the nation - Sakshi". web.archive.org. 2024-02-25. Archived from the original on 2024-02-25. Retrieved 2024-02-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Nitin Gadkari approves construction of sea-link to connect Okha, Bet Dwarka" (in ఇంగ్లీష్). www.indianexpress.com. The Indian Express. Retrieved 25 October 2022.
  3. "Centre approves Rs 962 crore cable stayed bridge connecting Okha and Bet Dwarka". DeshGujarat (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-08-23. Retrieved 2022-12-13.