Jump to content

సుదర్శన చక్రం

వికీపీడియా నుండి
(సుదర్శన చక్రము నుండి దారిమార్పు చెందింది)

{విస్తరణ}}

లక్ష్మీనారాయణుల వెనుక సుదర్శనచక్రం

సుదర్శన చక్రం (సంస్కృతం: सुदर्शण चक्रम्) శ్రీ మహావిష్ణువు ఆయుధం. మహావిష్ణువు కుడి చేతితో సుదర్శన చక్రాన్ని పట్టుకొంటాడు. మిగిలిన మూడు చేతులతో శంఖం, గద, పద్మాన్ని ధరిస్తాడు. శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రంతో అనేక మంది రాక్షసులను సంహరించాడు. సుదర్శన చక్రం తేజస్సుకి చిహ్నం. శ్రీరంగం మొదలైన క్షేత్రాలలో సుదర్శనచక్రానికి ప్రత్యేకంగా ఆలయాలు ఉన్నాయి. తిరుమల బ్రహ్మోత్సవాలలో చివరిదినాన స్వామి పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది.[1]{

సుదర్శన చక్ర ప్రాప్తి

[మార్చు]

వామన పురాణంలోని కథ

[మార్చు]

ప్రీతి చెంది సుదర్శన చక్రం అనే చక్రాయుధాన్ని ఇస్తాడు. విష్ణువు తన నేత్రాన్ని సమర్పించుకొంటాడు. పరమ శివుడు ప్రసన్నుడై మహావిష్ణువు కి అత్యంత శక్తి వంతమైన సుదర్శన చక్రాన్ని ఇస్తాడు. ఆ చక్రంలో 12 ఆకులు, 6 నాభులు, 2 యుగాలు ఉంటాయి, అవి సకలదేవతలను, రాశులని, ఋతువులను, అగ్నిని, సోముడు, మిత్రవరుణులు, ఇంద్రుడు, విశ్వ దేవతలు, ప్రజాపతి, హనుమంతుడు,ధన్వంతరి, తపస్సు, చైత్రమాసం నుండి ఫాల్గుణ మాసం వరకు ప్రతిష్ఠమై ఉంటాయి అని చెబుతాడు పరమశివుడు. విష్ణువు ఆ సుదర్శన చక్రం యొక్క శక్తిని శివుడి మీదనే ప్రయోగం చేయవలేననినున్నదని శివునితో ప్లుతాడు. శివుడు అందుకు అంగీకరిస్తాడు, పరమ శక్తి వంతమైన ఆ సుదర్శన చక్రం శివుడిని విశ్వేశుడు, యజ్ఞేశుడు, యజ్ఞయాజకుడు అనే 3 భాగాలుగా ఖండిస్తుంది, ఆ విధంగా ఖండింపడిన శివుని చూసి విష్ణువు ఖిన్నుడౌతాడు. అప్పుడు శివుడు కనిపించి సుదర్శన చక్రం తన పాకృత, వికృత రూపాలను ఖండించింది కాని తన తన స్వాభవమైన తత్వాన్ని ఏమి చేయలేక పోయిందని, ఆ సుదర్శన చక్రాన్ని తీసుకొని శ్రీదాముడి సంహరించమని చెబుతాడు. ఆ మూడు ఖండాలుగా హిరణ్యాక్ష, సువర్ణాక్ష, విరుపాక్ష గా పూజింపడుతాయని చెబుతాడు.

మరో ఇతిహాసంలోని కథ

[మార్చు]

సుదర్శనోపనిషత్తు ప్రకారం, సుదర్శన చక్రం దేవశిల్పి అయిన విశ్వకర్మచే తయారుచేయబడినది. విశ్వకర్మ కూతుర్ని సూర్యునికిచ్చి వివాహం చేస్తాడు. అయితే ఆమె సూర్యుని తేజస్సు మూలంగా అతన్ని చేరలేకపోతుంది. విశ్వకర్మ సూర్యుని తేజస్సును తగ్గించడానికి సానపట్టాడు. అప్పుడు రాలిన పొడితో మూడింటిని తయారుచేశాడు. ఒకటి పుష్పక విమానం, రెండవది పరమశివుని త్రిశూలం, మూడవది విష్ణుముర్తి సుదర్శన చక్రం.

అన్నమాచార్య కీర్తన

[మార్చు]

సుదర్శన చక్రము మీద అన్నమయ్య కీర్తన


ప|| చక్రమా హరిచక్రమా | వక్రమైనదనుజుల వక్కలించవో ||
చ|| చుట్టిచుట్టి పాతాళముచొచ్చి హిరణ్యాక్షుని | చట్టలు చీరిన వోచక్రమా |
పట్టిన శ్రీహరిచేత బాయక యీజగములు | వొట్టుకొని కావగదవో వోచక్రమా ||
చ|| పానుకొని దనుజులబలుకిరీటమణుల | సానలదీరిన వోచక్రమా |
నానాజీవముల ప్రాణములుగాచి ధర్మ- | మూని నిలుపగదవో వోచక్రమా ||
చ|| వెరచి బ్రహ్మాదులు వేదమంత్రములని- | పురట్లు గొనియాడే రోచక్రమా |
అరిమురి దిరువేంకటాద్రీశు వీథుల | వొరవుల మెరయుదువో వోచక్రమా ||

మూలాలు

[మార్చు]

వామన పురాణం

  1. Dalal, R. (2014). Hinduism: An Alphabetical Guide. Penguin Books Limited. p. 1184. ISBN 978-81-8475-277-9. Retrieved 18 July 2024.