సుధాకర్ దేశ్‌ముఖ్
సుధాకర్ దేశ్‌ముఖ్ | |||
పదవీ కాలం 2009 – 2019 | |||
ముందు | దేవేంద్ర ఫడ్నవిస్ | ||
---|---|---|---|
తరువాత | వికాస్ ఠాక్రే | ||
నియోజకవర్గం | నాగపూర్ వెస్ట్ | ||
పదవీ కాలం 1991 – 1996 | |||
ముందు | వినోద్ గూడాదే పాటిల్ | ||
నియోజకవర్గం | మహారాష్ట్ర | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నాగ్‌పూర్ , మహారాష్ట్ర , భారతదేశం | 1957 అక్టోబరు 11||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
పూర్వ విద్యార్థి | హిస్లాప్ కాలేజ్ నాగ్‌పూర్ కామర్స్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
సుధాకర్ శ్యాంరావు దేశ్‌ముఖ్ (జననం 11 అక్టోబర్ 1957) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు నాగపూర్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]సుధాకర్ దేశ్‌ముఖ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి నాగ్‌పూర్ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా పని చేసి 1991 నుండి 1996 వరకు మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా పని చేసి 2000లో భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఆయన ఆ తరువాత 2003లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, 2006లో నాగ్‌పూర్ నగర అధ్యక్షుడిగా, దేవేంద్ర ఫడ్నవీస్ సలహాదారుడిగా పని చేసి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నాగపూర్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అనీస్ అహ్మద్ పై 1,979 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
సుధాకర్ దేశ్‌ముఖ్ 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నాగపూర్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వికాస్ ఠాక్రేపై 26,402 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వికాస్ ఠాక్రే చేతిలో 6,367 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ TimelineDaily (29 October 2024). "Nagpur West: Congress, BJP Gear Up For Political Showdown" (in ఇంగ్లీష్). Archived from the original on 7 December 2024. Retrieved 7 December 2024.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ The Times of India (23 November 2024). "Nagpur West Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 7 December 2024. Retrieved 7 December 2024.