సుధాన్షు బిస్వాస్
సుధాన్షు బిశ్వాస్ పశ్చిమ బెంగాల్కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. అతను తన జీవితం మొత్తం దేశం కోసం, పేదవారి కోసం త్యాగం చేసిన మహనీయుడు.
జీవిత విశేషాలు
[మార్చు]అతను 1918 లో పశ్చిమబెంగాల్ లోని రామకృష్ణాపూర్ గ్రామంలో జన్మించాడు. బ్రిటీష్ వారి అణచివేతకు వ్యతిరేకంగా కలకత్తా లో స్వాతంత్ర్యం కోసం పొరాడి అనేక సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు. తెల్లని చొక్కా, తెల్లని ధోవతి, తల పాగా ధరించి అతి సామాన్యంగా ఉండే బిశ్వాస్ రామకృష్ణ పరమహంసకు భక్తుడు. పెళ్ళి కూడా చేసుకోకుండా తన జీవితం మొత్తం దేశం కోసం, పేదవారి కోసం త్యాగం చేసాడు.[1]
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సుందరబన్ ప్రాంతంలో ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారాన్ని ప్రారంభించాడు. అయితే ఆ ప్రాంతంలో తీవ్ర పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న పిల్లలను చూసి చలించిపోయిన బిశ్వాస్, వారి బాధ్యతలను స్వీకరించాడు. పేద, అనాథపిల్లల కోసం అనాధాశ్రమాలు స్థాపించాడు. వారి చదువుల కోసం ప్రత్యేకంగా పాఠశాలలను నిర్మించాడు. అయితే సమాజ సేవ, వ్యాపారం రెండు ఒకేసారి చేయడం కష్టంగా మారడంతో, ఇక వ్యాపారానికి శాశ్వతంగా వదిలేసి పూర్తిగా పేదల సంక్షేమం కోసం పని చేయడం మొదలు పెట్టాడు. ఇక సుందరబన్ లో ఏకంగా 17 అనాధాశ్రమాలను నిర్మించాడు. విరాళాలు సేకరిస్తూ పిల్లలకయ్యే తిండి ఖర్చు, చదువులు, బట్టలు సర్వం బిశ్వాస్ భరించేవాడు. వీరి కోసం ప్రత్యేకంగా పాఠశాలలను నిర్మించాడు.[2][3][4]
తరువాత 1971 లో తన సొంత గ్రామమైన రామకృష్ణపూర్ లోని తనకు వారసత్వంగా వచ్చిన పొలంలో వృద్ధుల కోసం పెద్ద వృద్ధాశ్రమాన్ని నిర్మించాడు. వారికి భోజనం, పడక వసతులతో పాటు వారి వైద్య ఖర్చులను అతనే భరించేవాడు. వారికోసం ఏకంగా ఒక హాస్పటల్ ను కట్టించి, వృద్ధులతో పాటు పేదవారికి ఉచితంగా వైద్య సేవలు అందించేవాడు. పేదలకు సేవ చేయడం కోసం రామకృష్ణ సేవాసమితిని ఏర్పాటు చేశాడు. వీటి నిర్వహణ కోసం అతను బెంగాల్ రాష్ట్రమంతా తిరుగుతూ విరాళాలు సేకరిస్తూ ఈ సంస్థలను నడిపించడం గొప్ప విషయం.[5][6]
భిశ్వాస్ చేస్తున్న గొప్ప సామాజిక సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2018లో సమాజసేవ విభాగంలో పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.
మూలాలు
[మార్చు]- ↑ "జీవితమంతా దేశసేవకే అంకితం చేసిన స్వాతంత్ర్యసమరయోధుడు".[permanent dead link]
- ↑ "Padma Shree 2018: Meet Bengal Freedom Fighter Sudhanshu Biswas - Kolkata 24*7 English | DailyHunt". DailyHunt. Retrieved 2018-08-19.[permanent dead link]
- ↑ "This is not the India we fought for, says freedom fighter Padma Shri Sudhanshu Biswas". The New Indian Express. Archived from the original on 2018-08-15. Retrieved 2018-08-19.
- ↑ "This 98-year-old freedom fighter has built eighteen primary schools for the poor children". YourStory.com. 2016-05-15. Archived from the original on 2020-04-14. Retrieved 2018-08-19.
- ↑ "A grandpa's story". www.theweekendleader.com. Archived from the original on 2018-08-21. Retrieved 2018-08-19.
- ↑ "He is 99, Fought the British, Served the Poor & Has Just Won the Padma Shri!". The Better India. 2013-03-18. Retrieved 2018-08-19.[permanent dead link]
బయటి లంకెలు
[మార్చు]- News18 Bangla (2018-01-26), 99 Year Year Freedom Fighter Sudhanshu Biswas Awarded By Padma Shri | ETV NEWS BANGLA, retrieved 2018-08-19
{{citation}}
: CS1 maint: numeric names: authors list (link) - "TheBetterIndia". www.facebook.com. Retrieved 2018-08-19.