సునీల్ మిత్తల్

వికీపీడియా నుండి
(సునీల్ మిట్టల్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సునీల్ భారతి మిట్టల్
2024 సునీల్ భారతి మిట్టల్
జననం (1957-10-23) 1957 అక్టోబరు 23 (వయసు 66)
లూథియానా, పంజాబ్, ఇండియా
జాతీయతఇండియన్
విద్యాసంస్థపంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్[1]
వృత్తిభారతి ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు & ఛైర్మన్
పిల్లలు3, కవిన్ భారతి మిట్టల్ తో సహా
తల్లిదండ్రులుసాట్ పాల్ మిట్టల్ (తండ్రి)
బంధువులుశరణ్ పస్రిచా
(అల్లుడు)
వెబ్‌సైటు[1]
నోట్సు

సునీల్ భారతీ మిట్టల్ (జననం 1957 అక్టోబరు 23), భారతీయ పారిశ్రామికవేత్త, దాత, భారతీ ఎంటర్ ప్రైజెస్ స్థాపకుడు, చైర్మన్. ఈ సంస్థకు టెలీకాం, ఇన్స్యురెన్స్, రియల్ ఎస్టేట్, హోటల్, వ్యవసాయం, ఆహారం వంటి వ్యాపార రంగాలలో వ్యాపారాలున్నాయి. ఈ సంస్థకు చెందిన భారతి ఎయిర్ టెల్ ప్రపంచ 3వ, భారత మొదటి అతిపెద్ద టెలీకాం సంస్థ. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని 20 దేశాల్లో, దాదాపు 300 మిలియన్ ప్రజలకు టెలీకాం సేవలందిస్తోంది ఈ సంస్థ.[3] 2016వ అర్ధసంవత్సరంలో ఈ సంస్థ 14.75 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. 7 బిలియన్ నికర ఆదాయంతో సునీల్ భారతదేశపు 8వ ధనికునిగా ఫోర్బ్స్ పేర్కొంది.[4]

2007లో భారత ప్రభుత్వం ఈయనను పద్మభూషన్ అవార్డుతో గౌరవించింది.[5] జూన్ 15, 2016న అంతర్జాతీయ వాణిజ్య మండలి(చాంబర్ ఆఫ్ కామర్స్)కు చైర్మన్ గా ఎన్నికయ్యారు సునీల్[6]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

సునీల్ భారతి మిట్టల్ పంజాబీ అగర్వాల్ కుటుంబంలో పుట్టారు. ఆయన తండ్రి సత్ పౌల్ మిట్టల్ పంజాబ్ నుండి రాజ్యసభకు ఎంపీగా చేశారు. 1976, 1982 సంవత్సరాల్లో రెండు సార్లు పంజాబ్ నుంచి గెలవగా, 1988లో ఒకసారి రాజ్యసభకు నామినేట్ చేయబడ్డారు. సునీల్ ముందుగా ముస్సోరిలోని వ్యన్ బెర్గ్ ఎలెన్ స్కూల్ లో చేరినా, తరువాత గ్వాలియర్ లోని స్కిండియా స్కూల్ లో చదివారు. చండీగఢ్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రఖ్యాత ఆర్య కళాశాల, లుథియానాలో బిఎ డిగ్రీ పూర్తి చేశారు.[7] ఈయన తండ్రి 1992లో గుండె పోటుతో మరణించారు.

వ్యవస్థాపక వెంచర్లు

[మార్చు]
మిత్తల్ (ఎడమ ప్రక్క)

మొదటి తరం వ్యాపారవేత్త అయిన సునీల్, తన మొదటి వ్యాపారాన్ని ఏప్రిల్ 1976లో మొదలుపెట్టారు.[8] తన 18వ ఏట 20,000 రూపాయల పెట్టుబడితో, స్థానిక సైకిళ్ళ తయారీకి స్పేర్ పార్టులు అందించే వ్యాపారం చేశారు సునీల్.[9]

అవార్డులు, గుర్తింపులు

[మార్చు]
  • 2007లో భారత ప్రభుత్వంచే పద్మభూషన్ అవార్డు
  • ఎన్డీటీవి బిజినెస్ లీడర్ పురస్కారాలు ఇచ్చిన ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా లీడర్ గా గుర్తింపు
  • జి.ఎస్.ఎం.ఎ చైర్మన్ అవార్డు
  • ఆసియా బిజినెస్ మెన్ ఆఫ్ ది ఇయర్, ఫార్ట్యూన్ పత్రిక, 2006
  • టెలికాం పర్సన్ ఆఫ్ ది ఇయర్, వాయిస్&డేటా, 2006
  • సి.ఇ.వో ఆఫ్ ది ఇయర్, ఫ్రోస్ట్ అండ్ సుల్లివన్ ఆసియా పసిఫిక్ ఐసిటి అవార్డులు, 2006
  • ఉత్తమ ఆసియా టెలీకాం సి.ఇ.వో, టెలీకాం ఆసియా అవార్డులు, 2005
  • ఉత్తమ సి.ఇ.వో, భారత్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్, 2005
  • బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్, ఎకనామిక్ టైమ్స్, 2005
  • ఫిలాంత్రఫిస్ట్(దాత)ఆఫ్ ది ఇయర్ అవార్డ్, ది ఏషియన్ అవార్డులు, 2010[10]
  • ఇన్సెడ్ బిజినెస్ లీడర్ అవార్డు, 2011[11]
  • హొనొరిస్ కాసా డాక్టరేట్ ఆఫ్ సైన్సెస్(డి.ఎస్.సి) డిగ్రి, ఎమిటీ విశ్వవిద్యాలయం, గుర్ గావ్, 2016[12]

మూలాలు

[మార్చు]
  1. Nair, Vinod (22 December 2002). "Sunil Mittal speaking: I started with a dream". The Times of India.
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; deal అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. "Airtel becomes third largest globally". Gadgets.ndtv.com. 30 June 2015.
  4. "Richest persons in India". Ontoplists.com. Archived from the original on 1 జూలై 2015. Retrieved 30 June 2015.
  5. "Sunil Mittal, Indra Nooyi get Padma Bhushan". The Hindu Businessline. 27 January 2009. Retrieved 1 April 2010.
  6. "Telecom giant Sunil Bharti Mittal named ICC Chairman". ICC. 15 June 2016. Archived from the original on 16 జూన్ 2016. Retrieved 6 June 2016.
  7. "The World's Billionaires". Forbes. 11 March 2009. Retrieved 1 April 2010.
  8. "Sunil Mittal TimesNow interview". YouTube.com. Retrieved 1 April 2010.
  9. Clay Chandler (17 January 2007). "Wireless Wonder: India's Sunil Mittal". CNN. CNNMoney.com. Retrieved 1 April 2010.
  10. "Sunil Mittal bags award". Articles.economictimes.indiatimes.com. Retrieved 30 June 2011.
  11. "Sunil Mittal gets INSEAD award". The Hindu. In.com. Archived from the original on 25 మార్చి 2012. Retrieved 30 June 2011.
  12. "Airtel's Sunil Mittal, Paytm's Vijay Shekar given honorary degrees by Amity University". DNA INDIA.com.