సునీల్ సత్పాల్ సాంగ్వాన్
సునీల్ సత్పాల్ సాంగ్వాన్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
ముందు | సోమ్‌వీర్ సంగ్వాన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | దాద్రీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
సునీల్ సత్పాల్ సాంగ్వాన్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో దాద్రీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
వృత్తి జీవితం
[మార్చు]సునీల్ సంగ్వాన్ హర్యానా ప్రభుత్వంలో రెవెన్యూ మరియు సహకార శాఖ మంత్రిగా పనిచేసిన సత్పాల్ సాంగ్వాన్ కుమారుడు. సునీల్ 2002లో హర్యానా జైళ్ల శాఖలో విధులు నిర్వర్తించారు. భోంద్సీ జైల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్‌గా జైళ్ల శాఖతో ప్రయాణం ప్రారంభించి చివరి పోస్టింగ్ కూడా ఇదే జైలులో జైలు సూపరింటెండెంట్ పదవిలో ఉంటూ వీఆర్‌ఎస్ తీసుకున్నాడు.
రాజకీయ జీవితం
[మార్చు]సునీల్ సంగ్వాన్ జైళ్ల శాఖలో 22 ఏళ్లకు పైగా పనిచేసిన తర్వాత వీఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన 2024 సెప్టెంబర్ 1న హర్యానా ప్రభుత్వ హోం శాఖ సునీల్ దరఖాస్తును ఆమోదించగా సెప్టెంబర్ 3న బీజేపీలో చేరాడు.[3] ఆయన 2024 ఎన్నికలలో దాద్రీ నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మనీషా సాంగ్వాన్ పై 1957 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ TimelineDaily (8 October 2024). "Dadri Assembly Result: BJP's Sunil Sangwan Wins". Archived from the original on 4 November 2024. Retrieved 4 November 2024.
- ↑ Hindustantimes (3 September 2024). "Former minister Babli, two others join BJP". Archived from the original on 4 November 2024. Retrieved 4 November 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Dadri". Retrieved 4 November 2024.
- ↑ India Today (8 October 2024). "BJP's Sunil Sangwan, ex-jailer in whose tenure Ram Rahim got out 6 times, wins" (in ఇంగ్లీష్). Archived from the original on 4 November 2024. Retrieved 4 November 2024.
- ↑ TimelineDaily (9 October 2024). "Sunil Sangwan: New BJP Haryana MLA - Ex-Jailer Who Gave Ram Rahim 6 Paroles" (in ఇంగ్లీష్). Archived from the original on 4 November 2024. Retrieved 4 November 2024.