సుపరిపాలనా దినం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత ప్రభుత్వం భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జన్మదినమైన డిసెంబరు 25ను సుపరిపాలనా దినంగా నిశ్చయించింది.[1]

వ్యతిరేకత-విమర్శ[మార్చు]

డిసెంబరు 25వ తేదీ ప్రపంచవ్యాప్తంగా చాలామంది క్రైస్తవులు క్రిస్మస్ పండుగ జరుపుకునే రోజు కావడంతో ఆ రోజును సుపరిపాలనా దినంగా నిర్వహించడం విమర్శలు రేకెత్తించింది. కాంగ్రెస్, వామపక్షాలు మొదలుకొని చాలా రాజకీయ పక్షాలు ఈ ప్రయత్నాన్ని నిరసించాయి. క్రిస్మస్ సెలవును రద్దుచేసి ఆరోజున సుపరిపాలనా దినంగా జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై పార్లమెంటులో దుమారం చెలరేగింది. చివరకు పార్లమెంటులో ఈ విషయంపై వచ్చిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం క్రిస్మస్ సెలవు రద్దుచేస్తూ ఏ ఆదేశమూ వెలువడలేదని స్పష్టంచేశారు.[2]

మూలాలు[మార్చు]

  1. "వాజపేయి జన్మదినం 'సుపరిపాలన దినం'". సాక్షి (జగతి పబ్లికేషన్స్). సాక్షి. డిసెంబర్ 3, 2014. Retrieved 25 December 2014.
  2. "క్రిస్మస్‌ సెలవు రద్దుపై రేగిన దుమారం". ప్రజాశక్తి. తెలంగాణా ప్రజాశక్తి. డిసెంబరు 16, 2014. Retrieved 25 December 2014. Check date values in: |date= (help)