సుభాషిత త్రిశతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సుభాషిత త్రిశతి రచయిత భర్తృహరి. ఇది సంస్కృత లఘుకావ్యం. ఇందు నీతి, శృంగార, వైరాగ్యాలనే మూడు భాగాలు ఉన్నాయి. భర్తృహరి సుభాషితాలను అనువాదం చేసిన వారిలో ఎలకూచి బాలసరస్వతి, పుష్పగిరి తిమ్మన, ఏనుగు లక్ష్మణకవి ముఖ్యులు. ఇందు ఏనుగు లక్ష్మణకవి రచించిన పద్యాలు బాగా ప్రసిద్ధి చెందాయి. ఈయన 18వ శతాబ్దికి చెందిన కవి.

కవి పరిచయం[మార్చు]

సుభాషిత త్రిశతి యను పేరుగల ఈ నీతి గ్రంథమును భర్తృహరి యను పేరు గల యోగీశ్వరుడు రచించెనని ప్రతీతి కలదు. ఈ భర్తృహరి యెక్కడివాడో యెప్పటివాడో స్పష్టముగా చెప్పుట సాధ్యముకాదు. కాళిదాసు వంటి కవులను పోషించిన విక్రమార్కునకు భర్తృహరి యను సోదరుడొకడు కలడని విక్రమార్క కథలందు వినబడుచున్నది. పాణినీయ వ్యాకరణమున త్రిపాదికి వివరణమును, వాక్యపదీయము రచియించిన భర్తృహరి యొకడు కలడు. భర్తృహరి నిర్వేద నాటకమున ప్రస్తుతుండగు భర్తృహరి యొకడు కలడు. వీరందరు వేర్వేరు పురుషులో లేక యొక్కడో తెలియదు. విక్రమార్కుని సోదరుడే యీ కృతి కర్త యగునేని ఈతడు క్రీ.పూ. ప్రథమ శతాబ్దినాటివాడగును. మొదటి విక్రమార్కుని గూర్చియే పలు తగవులున్నవి. కొందరు శూద్రకునికే విక్రమార్కుడని నామాంతర మనుచున్నారు. అనిశ్చితము అయిన కవి దేశ కాలముల గూర్చి యిక చర్చ చాలు.

భర్తృహరి ఈ త్రిశతికి సంధాత మాత్రమే కాని రచయిత కాడని కొందరనుచున్నారు. ఈ త్రిశతి లోని శ్లోకములు ఎక్కువగా భాసుని నాటకాదులందు గాన వచ్చుచున్నవి. కావున నట్లనుట యుక్తముగా దోచుచున్నది. కొన్ని శ్లోకములను ఇతర గ్రంథముల నుండి సంధానించి మరికొన్నింటిని నాతడు రచియించి యీ త్రిశతిని గూర్చి యుండవచ్చును.[1]

ఇందలి శ్లోకములన్నియు అనుభవజ్ఞానముతో చెప్పినట్లు పాఠకుల హృదయాలలోనికి సూటిగా పోయి వారిని సంస్కరించుటకు అనుకూలములై యున్నవి. నీతి శతకము కామందకీయాది నీతి గ్రంథముల సారమన దగి యున్నది. శృంగార శతకము అమరుకాది శృంగార గ్రంథములకు దీసిపోవనిది. వైరాగ్య శతకము శాంతరస జ్వాలలను గ్రక్కుచు సంసారాంధకారమున గొట్టుకొను చుండువారికి వెలుగు నొసగుచున్నది. శృంగార రసము చిప్పిలునట్లు శృంగార శతకమును రచియించినవాడే సంసారుల నందరను సన్యాసులుగా జేయజాలునంత శక్తి గల వైరాగ్య శతకమును గూడ రచించినవాడగుట యబ్బురమే యగును.!

గీ.యతి విటుఁడు కాక పోవు టె ట్లస్మదీయ
కావ్య వైరాగ్య వర్ణనా కర్ణనమున
విటుఁడు యతి గాక పోరాదు వెస మదీయ
కావ్య శృంగార వర్ణనా కర్ణనమున.

అను సంకుసాల నృసింహ కవి పద్యమిప్పట్టున స్మరింప దగినదిగా నున్నది. ఇంతకును ఈ త్రిశతి సంధాన గ్రంథమను వాదమొకటి కలదు గదా!

ఏ తద్గ్రంథ గౌరవమును దెలుపుటకు ఈశ్లోకమొకటి చాలును

శ్లో. న ద్యాతం పద మీశ్వరస్య విధి వత్సంసార విచ్ఛిత్తయే
స్వ్ర్గ స్వారకవాట పాటనపటుర్ద ర్మో౽పి నోపార్జితః
నారీపీనపయోధరోరుయుగళీస్వాప్నే ౽ పి నాలింగితా
మాతుః కేవలమేవ యౌ వనవనచ్ఛేదే కుఠారావయమ్

తెలుగు అనువాదము[మార్చు]

నానా దేశములందు నానా భాషల లోనికి ఈ త్రిశతి అనువదింపబడినది. తెలుగునను దీనిని బలువురు పరివర్తించిరి. అందు ముఖ్యులు ముగ్గురు. మహామహోపాథ్యాయ బిరుదాంకుడగు ఎలకూచి బాల సరస్వతి, ఏనుగు లక్ష్మణ కవి , పుష్పగిరి తిమ్మకవి. ఎలకూచి బాలసరస్వతి జటప్రోలు సంస్థానాధీశ్వరుడగు సురభి మల్ల భూపాలునకు అంకితముగా మల్ల భూపాలీయ మను పేర దీని దెనిఁగించెను. "సురభిమల్లా నీతి వాచస్పతీ, సురభిమల్లా మానినీ మన్మథా" అని ప్రతి పద్యము చివరను కృతి పతి సంబోధనము చేర్చుటచే నాతడు చిన్ని శ్లోకమును దెనిగించుటలో సరిపోదగిన వృత్తములో గడపటి చరణమును గోల్పోవలసి వచ్చుట యను నసౌకర్యమునకు బాల్పడెను. కావున నాతని తెనిగింపు కొన్ని పట్టుల లక్ష్మణకవి కృతికి వెనకబడుచున్నది. ప్రశస్త తరముగా నీ త్రిశతిని దెలిగించిన లక్ష్మణకవి రామేశ్వరమాహాత్మ్యాదులగు నితర కృతుల గూడ గొన్నింటిని రచించినాడు గాని వానిలో కవిత బాలసరస్వతి చంద్రికా పరిణయాది కృతులలోని కవితకు మిక్కిలి దీసిపోవునదిగానే యున్నది. లక్ష్మణ కవి కృతులలో నీ త్రిశతి తెనిగింపే మిక్కిలి ఇంపయినదై సుప్రఖ్యాతమయి యున్నది. పుష్పగిరి తిమ్మ కవియు నీ సుభాషిత త్రిశతిని దెలిగించినాడట.

భర్తృహరి సుభాషితాల లో వివిధ భాగములు[మార్చు]

నీతి శతకం[మార్చు]

 • మూర్ఖ పద్ధతి
 • दिक्कालाद्यनवच्छिन्नानन्तचिन्मात्रमूतर्यये । स्वानुभूत्येकमानाय नमः शान्ताय तेजसे ।।
 • దిక్కాలాద్యనవచ్ఛిన్నానన్త మూర్తయే / స్వానుభూత్యేకమానాయ నమ శాన్తాయ తేజసే //
 • పదార్థః - దిక్ = Direction, కాల = time (past, Present& Future, ఆది = etc, అనవచ్ఛిన్న = can not be measured, అనన్త = endless, చిన్మాత్రమూర్తయే = Who is permeated by consciousness, స్వానుభూత్యేకమానాయ = can be known only with experience, శాన్తాయ = embodiment of light, తేజసే నమః = salutation
 • Meaning : Salutation to that embodiment of shining which is beyond the divisions of the direction and time etc, which is eternal, permeated by consiousness and composed one and to be understood only through the self-realisation.
 • संस्कृततात्पर्यम् -- पूर्वादिदिग्भिः भूतािदकालै अवस्थारूपादिभिः च उपाधिभिः अपरिच्छिन्नाय अनन्तचैतन्यस्वरूपिणे स्वानुभवैकवेद्याय तेजोमूर्तये (परमात्मने) नमः अस्तु ।।
 • हिन्दी ः पूर्व आदि दशिदशा, काल, अवस्था आदि उपाधियों से रहित, अनन्त एवं चैतन्यस्वरूप, अपने अनुभव मात्र से जाने जा सकने योग्य, शान्त, तेजस्वरूप परब्रह्म को नस्कार है ।
 • విద్వత్పద్దతి
 • మాన శౌర్య పద్ధతి
 • అర్థ పద్ధతి
 • దుర్జన పద్ధతి
 • సుజన పద్ధతి
 • పరోపకార పద్ధతి
 • ధైర్య పద్ధతి
 • దైవ పద్ధతి
 • కర్మ పద్ధతి

శృంగార శతకం[మార్చు]

 • స్త్రీ ప్రశంసా
 • సంభోగ వర్ణనము
 • కామినీ గర్హణము
 • సువిరక్త పద్ధతి
 • దుర్విరక్త పద్ధతి
 • ఋతు వర్ణన పద్ధతి

వైరాగ్య శతకం[మార్చు]

 • తృష్ణా దూషణము
 • విషయ పరిత్యాగ విడంబనము
 • యాచ్ఞా దైన్య దూషణము
 • భోగా స్థైర్యవర్ణనము
 • కాలమహిమాను వర్ణనము
 • యతినృపతి సంవాద వర్ణనము
 • మనస్సంబోధన నియమనము
 • నిత్యానిత్య వస్తు విచారము
 • శివార్చనము
 • అవధూత చర్య


సూచికలు[మార్చు]

 1. భర్తృహరి సుభాషితములు, మొదటి ఎడిషన్ 2008, లిఖిత ప్రచురణలు, విజయవాడ-10