Jump to content

సుమీత్ కుమార్

వికీపీడియా నుండి

 

సుమీత్ కుమార్ (1982 ఏప్రిల్ 15) ఒక భారతీయ నేపథ్య గాయకుడు సంగీత దర్శకుడు. సుమిత్ కుమార్ ప్రముఖ గాయకుడు, నటుడు కిషోర్ కుమార్, నటి లీనా చందావర్కర్ దంపతుల కుమారుడు.   2024 ఆగస్టులో సుమిత్ కుమార్ ప్రముఖ గాయని శైలజ సుబ్రహ్మణ్యం తో కలిసి క్యాన్సర్ బాధితుల కోసం విరాళాలు సేకరించడానికి పాటలు పాడి గుర్తింపు పొందాడు.[1]

ప్రారంభ జీవితం వృత్తి

[మార్చు]
తండ్రి కిషోర్ కుమార్ తో సుమీత్

కిషోర్ కుమార్ లీనా చందావర్కర్ దంపతులకు సుమిత్ కుమార్ 1982 ఏప్రిల్ 15 జన్మించాడు. లీనా చందావర్కర్ కిషోర్ కుమార్ కు నాలుగవ భార్య. కిషోర్ కుమార్ మరణించినప్పుడు సుమిత్ కుమార్ వయసు కేవలం ఐదు సంవత్సరాలు. తనతండ్రి కిషోర్ కుమార్ మరణం తర్వాత, సుమిత్ కుమార్ ను కిషోర్ కుమార్ రెండవ భార్య కుమారుడు అమిత్ కుమార్ పెంచాడు .

9 సంవత్సరాల వయస్సులో, సుమిత్ కుమార్ తన సోదరుడు అమిత్ కుమార్ తో కలిసి "హమ్ హై దో కిషోర్"అనే హిందీ పాటను పాడాడు. అతను అంతర్ముఖుడు సిగ్గుపడే వ్యక్తి. సుమిత్ కుమార్ ఎక్కువగా తల్లి సంరక్షణలో పెరిగాడు. .[2] 2004లో, సుమిత్ కుమార్ 'నాచ్' (2004) అనే సినిమాలో 'బంధనే లాగీ' పాటను పాడారు.[3]

విద్య.

[మార్చు]

సుమిత్ కుమార్ ముంబైలోని మిథిబాయి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ నుండి B.Com లో పట్టభద్రుడయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. "Kishore Kumar's son, Sumeet Kumar to sing to raise funds for cancer survivors". Hindustan Times (in ఇంగ్లీష్). 21 August 2024. Retrieved 24 August 2024.
  2. "Sumeet Kumar son of Kishore Kumar Childhood story". Times of India (in ఇంగ్లీష్). 22 August 2002. Retrieved 24 August 2024.
  3. "Kishore Kumar's son Sumeet Kumar to sing title track of film 'Naach'". India Today (in ఇంగ్లీష్). 13 September 2004. Retrieved 24 August 2024.