సుమేధ జయసేన
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
సుమేధ జయసేన | |||
వ్యక్తిగత వివరాలు
|
---|
సుమేధ గుణవతి జయసేన (సుమేధ జి. జయసేన) శ్రీలంకకు చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె శ్రీలంక పార్లమెంటులోని సభ్యురాలుగా, ప్రభుత్వ క్యాబినెట్ మంత్రిగా, శ్రీలంక పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్నారు.
ఆమె వయసు 62. తన రాజకీయ జీవితంలోని 25 నిరంతర సంవత్సరాల్లో వివిధ/అనేక కేబినెట్ మంత్రి పదవులను నిర్వహించారు. ఆమె తన నియోజకవర్గం 'మోనారగల'కు అపారమైన సేవలు చేస్తూనే ఉన్నారు. ఆమె సామాజిక సేవల మంత్రిగా శ్రీలంకలో వినాశకరమైన 2004 సునామీ తరువాత పునరావాసం / పునర్నిర్మాణ ప్రక్రియకు భారీగా సహకరించారు.
రాజకీయ జీవితం[మార్చు]
- 1989-1994 మొనరాగల జిల్లా పార్లమెంటు సభ్యురాలు
- 1994-1999 బౌద్ధ వ్యవహారాల ఉప మంత్రి
- 1999-2005 సామాజిక సేవల మంత్రి
- 2005-2010 మహిళా వ్యవహారాల / సాధికారత మంత్రి
- 2010 - ప్రస్తుత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి