సురేఖ యాదవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సురేఖా యాదవ్

సురేఖ యాదవ్ (జననం సెప్టెంబరు 2, 1965) భారత రైల్వేలో ట్రైన్  డ్రైవర్. ఆసియా మొత్తం మీద మొట్టమొదటి మహిళా ట్రైన్ డ్రైవర్  సురేఖ. 1988లో ట్రైన్ డ్రైవర్ అయిన ఆమె, సెంట్రల్ రైల్వేలో ఏప్రిల్ 2000లో అప్పటి రైల్వే మంత్రిగా ఉన్న మమతా బెనర్జీ నాలుగు మెట్రో  నగరాల్లో మొదటిసారిగా ప్రవేశపెట్టిన మొదటి లేడీస్ స్పెషల్ రైలును నడిపారు ఆమె.[1][2] 8 మార్చి 2011న జరిగిన అంతర్జాతీయ మహిళా  దినోత్సవం సందర్భంగా ఆమె పూణె నుండి ఛత్రపతి శివాజీ టర్మినల్  వరకూ నడిచే డెక్కన్ క్వీన్ ట్రైన్ ను నడిపారు. ఈ ప్రయాణం ఆమె కెరీర్ లో ప్రత్యేకమైనదిగా నిలిచింది. ఎందుకంటే ఈ దారి చాలా అందంగా ఉన్నా, కఠినమైనది కావడమే. ఈ ట్రైన్ నడిపిన మొట్టమొదటి ఆసియా  మహిళా ట్రైన్ డ్రైవర్ సురేఖ కావడం విశేషం.

ఇదంతా నాణేనికి ఒక వైపు కథ మాత్రమే. ఇక నాణేనికి రెండవ వైపు కత ఏమిటో పరిశీలిద్దాం.వాస్తవానికి రైల్వే అధికారులు కేవలం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ప్రతీ సంవత్సరం ఇలాంటి ఇలాంటివి కేవలం విస్తృత ప్రచారం కోసం మాత్రమే చేస్తారు.నిజానికి మహిళా లోకో పైలట్లను వారు నిర్వహించవలసిన ప్రాథమిక రన్నింగ్ డ్యూటీలలో కాకుండా నాన్-రన్నింగ్ డ్యూటీలో అంటే కార్యాలయంలలో(ఆఫీస్ డ్యూటీ) వారి సేవలు వినియోగించుకొంటంన్నారు. అసలు విషయం ఏమిటంటే రైల్వే బోర్డు లోకో పైలట్ ఉద్యోగాలకి మహిళా అభ్యర్థులు అనర్హులుగా సమ్మతిని తెలపమని డి.వో.పి.టి.ని అభ్యర్థిం చింది. వారు అభ్యర్థనను తిరస్కరించారు. [3][4] ఈ సందర్భంగా ముంబై మేయర్ శ్రద్ధా జాదవ్ ఆమెను అభినందించారు. నిజానికి ఈ ప్రతిష్టాత్మకమైన రైలు నడపడం ఆమె కల. ఈ రైలు నడిపేందుకు  ముంబై-పూణె రైల్వే ప్రవాసీ సంఘ్ ఆమెను ప్రోత్సహించారు.[5]

References[మార్చు]

  1. Bold, Bindaas And Successful. Cityplus: (10 March 2011).
  2. Indian Female Engine Loco Drivers. scientificindians.com.
  3. Realigning the tracks. The Hindu: (8 January 2013).
  4. Mumbai Western Railway believes in woman-power. DNAIndia: (9 March 2011).
  5. Costa, Roana Maria (8 March 2011). Asia's first motor woman to pilot Deccan Queen. The Times of India.