సులగిట్టి నర్సమ్మ
స్వరూపం
సులగిట్టి నర్సమ్మ | |
---|---|
జననం | 1920 |
మరణం | 25 డిసెంబరు 2018 (aged 97–98) బెంగళూర్, కర్ణాటక |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | మంత్రసాని |
జీవిత భాగస్వామి | అంజినప్ప |
పురస్కారాలు | పద్మశ్రీ (2018) జాతీయ పౌరుల పురస్కారం (2013) గౌరవ డాక్టరేట్ (2014) |
సులగిట్టి నర్సమ్మ (1920 - డిసెంబర్ 25, 2018) ఈమె కర్ణాటక రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త, మంత్రసాని. ఈమె పద్మశ్రీ పురస్కార గ్రహీత.[1]
తొలినాళ్ళ జీవితం
[మార్చు]ఈమె 1920లో కర్ణాటక రాష్ట్రంలోని తుమ్కూర్ జిల్లాలోని పావగడ గ్రామంలో జన్మించింది. ఈమె మాతృభాష తెలుగు. ఈమె తన 12 సంవత్సరాల వయసులో అంజినప్పను వివాహం చేసుకుంది. ఈమెకు 12 మంది సంతానం, వీరిలో నలుగురు చిన్నతనంలోనే మరణించారు. ఈమె మంత్రసాని నైపుణ్యాలను మంత్రసాని మారిగెమ్మా నుంచి నేర్చుకుంది. గర్భిణీ స్త్రీలకు సహజ ఔషదం తయారుచేసే కళను, శిశువు యొక్క ఆరోగ్యస్థితి, గర్భంలో ఉన్నప్పుడు పిండం యొక్క నాడిని ఏ పరికరాలు లేకుండా గుర్తించగలిగింది. ఈమె 2018 నాటికి 15,000 మందికి పైగా వైద్య సదుపాయాలు లేని గిరిజన ప్రాంతాల నివసించే మహిళల ప్రసావానికి సహాయం చేసింది.[2]
పురస్కారాలు
[మార్చు]- 2012: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ డి. దేవరాజ్ ఉర్స్ అవార్డు
- 2013: కిట్టూరు రాణి చెన్నమ్మ అవార్డు
- 2013: కర్ణాటక రాజ్యోత్సవ అవార్డు
- 2013: భారతదేశ జాతీయ పౌర పురస్కారం
- 2014: తుమ్కూర్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్
- 2018: పద్మశ్రీ పురస్కారం
మూలాలు
[మార్చు]- ↑ "Padma Shri awardee Sulagitti Narasamma passes away at 98". The Economic Times. 25 December 2018. Retrieved 18 December 2019.
- ↑ Staff. "Photos: Illaiyaraja, Ghulam Mustafa Khan, 41 others given Padma awards". Online Edition of Zee News. 2018, Express News Service. Archived from the original on 2018-07-27. Retrieved 2019-12-18.