సుశోవన్ బెనర్జీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుశోవన్ బెనర్జీ
జననం
బోల్పూర్, పశ్చిమ బెంగాల్, భారతదేశం
మరణం26 జులై 2022
ఉల్తాడాంగా, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుఒక్క రూపాయి డాక్టర్
విద్యాసంస్థ
  • R. G. కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్
  • కలకత్తా విశ్వవిద్యాలయం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త, వైద్యుడు
పురస్కారాలుపద్మశ్రీ (2020)

ఒక రూపాయి వైద్యుడుగా ప్రసిద్ధి చెందిన సుశోవన్ బెనర్జీ (మరణం:2022 జులై 26) పశ్చిమ బెంగాల్ కి చెందిన ఒక భారతీయ వైద్యుడు, రాజకీయవేత్త. పేదలకు కేవలం ఒక రూపాయికే వైద్యం చేసేవాడు. 1984లో బోల్పూర్ ఎమ్మెల్యేగా పని చేశారు. 2020లో, వైద్య రంగంలో ఆయన చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది.[1][2]

ప్రారంభ జీవితం[మార్చు]

బెనర్జీ పశ్చిమ బెంగాల్‌లోని బోల్‌పూర్‌కు చెందినవారు. అతను R. G. కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుండి గ్రాడ్యుయేషన్ పట్టాను, కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పాథాలజీలో తన PG డిగ్రీ పట్టాను అందుకున్నారు. తర్వాత అతను హెమటాలజీలో డిప్లొమా కోసం లండన్ వెళ్లాడు.[3]

రాజకీయ, ఉద్యోగ జీవితం[మార్చు]

బెనర్జీ 1984లో భారత జాతీయ కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి బోల్పూర్ నుండి పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1963 నుంచి పేద రోగులకు కేవలం ఒక్క రూపాయికే వైద్యం చేయటం ప్రారంభించారు. 2020లో అతను తన జీవితకాలంలో అత్యధిక సంఖ్యలో రోగులకు చికిత్స అందించిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. అదే సంవత్సరంలో, వైద్యరంగంలో ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. అతను R. G. కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ నుండి బంగారు పతకాన్ని కూడా పొందారు.[4]

అవార్డులు[మార్చు]

  • బంగారు పతకం
  • 2020లో పద్మశ్రీ

మూలాలు[మార్చు]

  1. প্রয়াত ‘১ টাকার ডাক্তার’ সুশোভন বন্দ্যোপাধ্যায়! শোকস্তব্ধ বোলপুর (in Bengali)
  2. "Bengal's 'one rupee doctor' dedicates Padma Shri award to his patients". The Financial Express (in అమెరికన్ ఇంగ్లీష్). 28 January 2020. Retrieved 11 November 2021.
  3. "দীর্ঘ ৫৭ বছর রোগী দেখে গিনেস ওয়ার্ল্ড রেকর্ডে নাম তুললেন 'এক টাকার ডাক্তার'". sangbadpratidin (in Bengali). Retrieved 11 November 2021.
  4. Bureau, Medical Dialogues (27 January 2020). "Dr Sushovan Banerjee West Bengal's 'one rupee doctor' dedicates Padma Shri award to his patients". medicaldialogues.in (in ఇంగ్లీష్). Retrieved 11 November 2021.