సూపర్ స్టార్

సూపర్ స్టార్ అంటే గొప్ప ప్రజాదరణ పొందిన వ్యక్తి, వారి రంగంలో విస్తృతంగా ప్రసిద్ధి చెందినవాడు, ప్రముఖుడు లేదా విజయం సాధించిన వ్యక్తి. "సూపర్ స్టార్స్" అని పిలువబడే ప్రముఖులలో నటులు, సంగీతకారులు, అథ్లెట్లు, ఇతర మీడియా ఆధారిత వృత్తులుగా పనిచేసే వ్యక్తులు ఉండవచ్చు.[1]
విస్తృతంగా ప్రచారం పొందిన ప్రముఖుడిని అతని యొక్క ప్రముఖ స్థాయిని గుర్తించడానికి ఆ ప్రముఖుని యొక్క పేరుకు ముందు సూపర్ స్టార్ అనే పదమును ఉపయోగించడం జరుగుతుంది. సినినటులు, నటీమణులు, సంగీతకారులు, క్రీడాకారులు, మీడియా ఆధారిత వృతులకు సంబంధించి ఉన్నత స్థాయిలో ఉన్న ప్రముఖులను గౌరవసూచకంగా లేక ప్రజాబిరుదుగా సూపర్ స్టార్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు తెలుగు సిని పరశ్రమకు సంబంధించి సూపర్ స్టార్ కృష్ణ, తమిళ సిని పరిశ్రమకు సంబంధించి సూపర్ స్టార్ రజనీకాంత్, హింది సినిపరిశ్రమకు సంబంధించి సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. ప్రస్తుతం సూపర్ స్టార్ తో పాటు మెగాస్టార్ అనే పదాన్ని కూడా ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవి.
మూలాలు
[మార్చు]- ↑ "Definition of SUPERSTAR". www.merriam-webster.com (in ఇంగ్లీష్). 2025-07-11. Retrieved 2025-07-20.