సూరపరాజుపల్లె
సూరపరాజు పల్లె, వైయస్ ఆర్ జిల్లా లోని రైల్వే కోడూరు మండలానికి చెందిన గ్రామం.
2022 లో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం వైఎస్‌ఆర్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. [1] [2]
సూరపరాజుపల్లె | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 13°55′47″N 79°21′18″E / 13.929657°N 79.354964°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్ఆర్ జిల్లా |
మండలం | కోడూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 516101 |
ఎస్.టి.డి కోడ్ | 08566 |
సూరపరాజుపల్లె గ్రామంలో శ్రీ సీతా, లక్ష్మణ, హనుమత్సమేత శ్రీ కోదండరామస్వామి మరియూ గరుడ, జీవధ్వజ, విమాన శిఖరముల అభినవ ప్రతిష్ఠా మహోత్సవం, 2014, మార్చి-9 నుండి 12 వరకూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, 12వ తేదీ బుధవారం నాడు, వేదపండితుల ఆధ్వర్యంలో సుప్రభాతసేవ, కుంభారాధన, ప్రాణ ప్రతిష్ఠ, ధేనువ దర్శనం, హారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిపించారు. తరువాత, ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. మరుసటిరోజు కుంభాభిషేకం నిర్వహించెదరు.
ఈ గ్రామ రైతులు అనంతరాజుపేట వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాల మేరకు "బగువా" రకం దానిమ్మ పంటను సాగు చేసి మంచి దిగుబడులు సాధించారు. ఈ ప్ర్రాంతంలో దానిమ్మ పంట పండించటం ఇదే మొదటిసారి. ఈ విత్తనాన్ని వీరు మహారాష్ట్రలోని 'సాంగ్లీ' నుండి తెచ్చారని చెప్పారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-05.
- ↑ ఈనాడు కడప 27 సెప్టెంబరు 2013. 5వ పేజీ.