సృంద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సృంద
జననం
సృంద మోల్

(1985-08-20) 1985 ఆగస్టు 20 (వయసు 39)[1]
కొచ్చి, కేరళ, భారతదేశం
ఇతర పేర్లుసృంద అషబ్,[2] సృంద అర్హాన్[3]
వృత్తి
  • నటి
  • మోడల్
  • డబ్బింగ్ ఆర్టిస్ట్
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
  • అషబ్
    (m. 2004; div. 2014)
    [4]
  • సిజు ఎస్. బావ
    (m. 2018)
పిల్లలు1

సృంద (మలయాళం: സൃന്ദ; జననం 1985 ఆగస్టు 20) భారతీయ నటి, మోడల్, డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆమె ప్రధానంగా మలయాళ సినిమాల్లో పని చేస్తుంది.[5][6] ఆమె తొలి చిత్రం ఫోర్ ఫ్రెండ్స్ (2010). 22 ఫిమేల్ కొట్టాయం (2012), అన్నయుమ్ రసూలుమ్ (2013), 1983 (2014), ఫ్రీడమ్ ఫైట్ (2022), కురుతి (2021), భీష్మ పర్వం (2022), ఆడు (2017) చిత్రాలలో ఆమె తన పాత్రలకు బాగా పేరు తెచ్చుకుంది.

ప్రారంభ జీవితం

[మార్చు]

సృంద ఫోర్ట్ కొచ్చిలోని సెయింట్ మేరీస్ ఆంగ్లో ఇండియన్ గర్ల్స్ హై స్కూల్‌లో 10వ తరగతి వరకు చదివింది. ఆ తరువాత, హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ చదువు కోసం పల్లురుత్తిలోని పాఠశాలకు వెళ్ళింది. ఇక డిగ్రీ ఆమె తేవరలోని సేక్రెడ్‌ హార్ట్‌ కాలేజీలో చదువుకుంది.[7]

చిన్నప్పటి నుండి సినిమాలు, ఫోటోగ్రఫీపై మక్కువ ఉన్న ఆమె అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది.[8] ఆమె కొంతకాలం టెలివిజన్ యాంకర్‌గా కూడా పనిచేసింది. ఆమె హెయిర్ ఆయిల్స్, జ్యువెలరీ బ్రాండ్‌ల వంటి ఉత్పత్తులకు మోడల్‌గా నిలిచింది.[9] ఇది చివరికి ఆమెను చలన చిత్రాలకు దారితీసింది, అక్కడ దర్శకుడు దిలీష్ నాయర్ ఆమెను ఆషిక్ అబుకు పరిచయం చేశాడు.

కెరీర్

[మార్చు]

ఆమె తొలి చిత్రం ఫోర్ ఫ్రెండ్స్ (2010) అయినప్పటికీ, ఆషిక్ అబు 22 ఫిమేల్ కొట్టాయం (2012) ఆమె సినీ రంగ ప్రవేశంగా పరిగణించబడుతుంది. ఆమె అందులో సహాయపాత్రలో నటించింది.[10] ఆ తరువాత, ఆమె తట్టతిన్ మరయతు (2012), 101 వెడ్డింగ్స్ (2012), నార్త్ 24 కాతం (2013), ఆర్టిస్ట్ (2013), అన్నయుమ్ రసూలుం (2013) వంటి అనేక చిత్రాలలో సహాయ పాత్రలు పోషించింది. 2014లో, స్పోర్ట్స్ ఫిల్మ్ 1983 (2014)లో ఆమె చెప్పుకోదగ్గ ప్రధాన పాత్ర పోషించింది. ఆ సంవత్సరం తరువాత, ఆమె పొలిటికల్ సెటైర్ మసాలా రిపబ్లిక్ (2014)లో పోలీసు అధికారిగా నటించింది. అదే రోజు విడుదలైన తమర్ పదార్ (2014), హోమ్లీ మీల్స్ (2014) అనే రెండు చిత్రాలలో నటించింది.[11]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సృందకు 19 సంవత్సరాల వయస్సులో అషబ్ తో వివాహం జరిగింది, ఒక కుమారుడు ఉన్నాడు. అయితే, వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్న ఆమె 2018లో తిరిగి సిజు ఎస్. బావను వివాహం చేసుకుంది.[12]

మూలాలు

[మార్చు]
  1. M, Athira; Sathyendran, Nita (23 May 2014). "With stardust in their eyes". The Hindu. Archived from the original on 2014-05-25. Retrieved 7 May 2019.
  2. "Srinda heads to Kollywood". The Times of India. TNN. 2017-01-10. Archived from the original on 15 September 2022. Retrieved 15 September 2022.
  3. Srinda (20 January 2015). "I use my son's name as my surname: Srinda". The Times of India (Interview). Interviewed by Shruti Karthikeyan. Retrieved 7 May 2019. {{cite interview}}: Unknown parameter |agency= ignored (help)
  4. Srinda (2018-11-12). "Newly wed Srinda's strength is her son". OnManorama (Interview) (in ఇంగ్లీష్). Interviewed by Onmanorama Staff. Archived from the original on 2018-11-12.
  5. "It's Srinda's voice for Shaun Romy in 'Kammatipaadam'". IndiaGlitz. 21 May 2016. Archived from the original on 7 September 2018. Retrieved 7 May 2019.
  6. Babu, Bibin (22 May 2016). 'കമ്മട്ടിപാട'ത്തിൽ ശബ്ദമായി സ്രിന്ദ കസറി [Srinda Kasari as voice in 'Kammattipada'] (in మలయాళం). TNN. Archived from the original on 7 September 2018. Retrieved 7 May 2019.
  7. Anand, Shilpa Nair (5 October 2014). "In love with cinema". The Hindu. Archived from the original on 24 March 2023. Retrieved 7 May 2019.
  8. Soman, Deepa (26 May 2014). "My friends ask me how I tricked Mammukka into clicking a selfie: Srinda Arhaan". Times Of India. TNN. Archived from the original on 14 February 2016. Retrieved 7 May 2019.
  9. Anand, Shilpa Nair (5 October 2014). "In love with cinema". The Hindu. Archived from the original on 24 March 2023. Retrieved 7 May 2019.
  10. Anand, Shilpa Nair (5 October 2014). "In love with cinema". The Hindu. Archived from the original on 24 March 2023. Retrieved 7 May 2019.
  11. Suresh, Meera (19 August 2014). "Making strides". The New Indian Express. Archived from the original on 7 March 2016. Retrieved 7 May 2019.
  12. "Malayalam actor Srinda ties the knot". Indian Express. 12 November 2018. Archived from the original on 23 February 2023. Retrieved 23 February 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=సృంద&oldid=4058112" నుండి వెలికితీశారు