సెంబి (2022 సినిమా)
సెంబి | |
---|---|
దర్శకత్వం | ప్రభు సోల్మన్ |
రచన | ప్రభు సోల్మన్ |
నిర్మాత | ఆర్. రవీంద్రన్ అజ్మల్ ఖాన్ రెయా |
తారాగణం | కోవై సరళ అశ్విన్ కుమార్ లక్ష్మీకాంతన్ తంబి రామయ్య నంజిల్ సంపత్ |
ఛాయాగ్రహణం | ఎం. జీవన్ |
కూర్పు | భువన్ |
సంగీతం | నివాస్ కే. ప్రసన్న |
నిర్మాణ సంస్థలు | ట్రైడెంట్ ఆర్ట్స్, ఏ.ఆర్. ఎంటర్‌టైన్‌మెంట్ |
పంపిణీదార్లు | రెడ్ జైంట్ మూవీస్ |
విడుదల తేదీ | 30 డిసెంబరు 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సెంబి 2022లో విడుదలైన తమిళ సినిమా. ట్రైడెంట్ ఆర్ట్స్, ఏ.ఆర్. ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై ఆర్. రవీంద్రన్, అజ్మల్ ఖాన్, రియా నిర్మించిన ఈ సినిమాకు ప్రభు సోల్మన్ దర్శకత్వం వహించాడు. కోవై సరళ, బేబీ నిలా, అశ్విన్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 డిసెంబర్ 30న థియేటర్లలో విడుదలై[1], డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో 2023 ఫిబ్రవరి 03న స్ట్రీమింగ్ ప్రారంభమైంది. [2]
కథ
[మార్చు]అరకులో ఓ కొండపై వీరతల్లి (కోవై సరళ) తన మనవరాలు సెంబి (బేబీ నిలా)తో కలిసి జీవిస్తూ ఉంటుంది. సెంబికి తల్లితండ్రులు లేకపోవడంతో అమ్మమ్మ అయిన వీరతల్లి, ఈ పాపని అల్లారు ముద్దుగా పెంచుతూ రోజు గడవడం కోసం కొండల్లో దొరికే తేనె, పక్షుల గుడ్లు తదితరు వస్తువుల్ని సేకరించి అమ్మి జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో ఓ రోజు తేనె నింపిన కుండని అమ్మడానికి వెళ్లిన సెంబి దారి మధ్యలో ముగ్గురు కుర్రాళ్లు ఆమెని దారుణంగా అత్యాచారం చేసి పారిపోతారు. సెంబికి న్యాయం జరగడానికి వీరతల్లి (కోవై సరళ) ఏమి చేసింది ? చివరకు ఏమైంది? అనేదే మిగతా కథ.[3]
నటీనటులు
[మార్చు]- కోవై సరళ
- అశ్విన్ కుమార్ లక్ష్మీకాంతన్ - లాయర్
- తంబి రామయ్య - బస్ కండక్టర్‌గా
- నాంజిల్ సంపత్
- పాల కరుప్పయ్య - రాజకీయ నాయకుడిగా
- జి. జ్ఞానసంబంధం - జడ్జి
- ముల్లై అరసి
మూలాలు
[మార్చు]- ↑ Disha (23 December 2022). "కోవై సరళ 'సెంబి' నుంచి న్యూ అప్‌డేట్!". Archived from the original on 5 February 2023. Retrieved 5 February 2023.
- ↑ Andhra Jyothy (3 February 2023). "తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే." Archived from the original on 4 February 2023. Retrieved 4 February 2023.
- ↑ Eenadu (12 February 2023). "రివ్యూ: సెంబి". Archived from the original on 2023-02-10. Retrieved 12 February 2023.