సెనెట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పరిచయం[మార్చు]

మనిషి ఆడిన అతి ప్రాచీన బోర్డ్ గేమ్ గా సెనెట్ (గేమ్ ఆఫ్ ప్యాసేజ్) అని చెప్పుకోవచ్చు. సెనెట్ గేమ్ బోర్డులు క్రీస్తు పూర్వం 3500 నుండి 3100 సంవత్సరాల నాటి ఫరో రాజుల సమాధుల్లో బయల్పడ్డాయి. దీన్ని బట్టి ఆ రోజుల్లో ఈజిప్టు మహారాజులు ఖాళీ సమయాల్లో సెనెట్ ఆట ఆడుకొనేవారని అనుకోవచ్చు. సెనెట్ ఆటను అసలు ఎలా ఆడాలో ఇప్పటికీ చరిత్రకారులకు చర్చగానే మిగిలిపోయింది. అయితే తిమోతీ కెండాల్, ఆర్ సి బెల్ వంటి చరిత్రకారులు సమాధుల గోడలపై వేయబడిన బొమ్మలను బట్టి ఈ ఆట ఎలా ఆడాలో ఊహించారు. సెనెట్ ఆటను ఇద్దరు వ్యక్తులు ఆడుకోవచ్చు.

ఆడే విధానం[మార్చు]

A Senet game from the tomb of Amenhotep III — the Brooklyn Museum, New York City

సెనెట్ బోర్డుకి 30 గడులు 3 వరుసల్లో ఉంటాయి. ఆడటానికి రెండు రంగుల్లో ఏడేసి బంట్లు చొప్పున మొత్తం 14 బంట్లు అవసరమవుతాయి. వీలైనంత తొందరగా అన్ని బంట్లు బోర్డు నుండి నిష్క్రమించేలా చేయడం ఈ ఆట ముఖ్య ఉద్దేశం. బోర్డుపై ఆటగాళ్ళ యొక్క బంట్లు S అనే ఇంగ్లీషు అక్షరం రూపంలో పాచికలు లేదా డైస్ చూపించే విలువను బట్టి కదులుతాయి. ఆటగాడి బంటు ప్రత్యర్థి బంటు ఉన్న గడిలోకి వెళితే ఆ బంట్లు తారుమారు అవుతాయి. కాని ఒకే వరుసలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ బంట్లు ఉంటే వాటిని తారుమారు చేయలేరు.

15 వ గడి పునర్జన్మ గడి. ఇక్కడినుండే బంట్లు బయల్దేరాలి. ఈ గడిలో వున్న మీ బంటుని ప్రత్యర్థి కదపడానికి కుదరదు. 26 వ గడి సంతోషాన్నిచ్చే గడి - ఇది గడి మీదుగా అన్ని బంట్లు వెళ్ళవలసివుంటుంది. ఈ గడిలోకి ప్రవేశిస్తే డై విసిరే మరో ఆధనపు అవకాశం లభిస్తుంది. ఈ గడిలో వున్న మీ బంటుని ప్రత్యర్థి కదపడానికి కుదరదు. 27 వ గడి నీటి గడి - ఈ గడిలోకి వచ్చిన బంటు తిరిగి 15 గడి నుండి బయల్దేల్సివుంటుంది. ఒకవేళ 15 గడిలో ప్రత్యర్థికి చెందిన బంటు వుంటే తిరిగి 1 వ గడి నుండి బయల్దేల్సివుంటుంది. 28 వ గడి మూడు నిజాల గడి. ఈ గడిలోకి వచ్చిన బంటు 3 పడినప్పుడే అక్కడినుండి కదలాల్సివుంటుంది. ఈ గడిలో వున్న మీ బంటుని ప్రత్యర్థి కదపడానికి కుదరదు. 29 వ గడి రి-అటొమ్ (లేదా హోరస్) గడి - ఈ గడిలోకి వచ్చిన బంటు 2 పడినప్పుడే అక్కడినుండి కదలాల్సివుంటుంది. ఈ గడిలో వున్న మీ బంటుని ప్రత్యర్థి కదపడానికి కుదరదు.

ఎవరైతే తమ అన్ని బంట్లును బోర్డు నుండి నిష్క్రమించేలా చేయగలరో వారే ఈ ఆటలో విజేత.

లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సెనెట్&oldid=2890720" నుండి వెలికితీశారు