సెవెన్ సీస్ ఎక్స్‌ప్లోరర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాడిజ్ వద్ద, 2017 లో సెవెన్ సీస్ ఎక్స్‌ప్లోరర్

సెవెన్ సీస్ ఎక్స్‌ప్లోరర్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, విలాసవంతమైన క్రూయిజ్ నౌక. ఈ క్రూయిజ్ నౌక 732 అడుగుల పొడవుతో 56 వేల టన్నులకు పైనే బరువుంటుంది. దీని నిర్మాణానికి 450 మిలియన్ డాలర్లు, అనగా సుమారు 2,800 కోట్ల రూపాయల ఖర్చయింది. ఇందులోని సూటులు (రూములు) చాలా పెద్దవిగా, విశాలంగా, సౌకర్యంగా, ఇంటీరియర్ డిజైనింగ్ తో చాలా అందంగా ఉంటాయి. ప్రయాణీకులకు విలాసవంతమైన సౌకర్యాన్ని అందించేందుకు ఇంత పెద్ద భారీ నౌకలో కేవలం 750 మందికి మాత్రమే ప్రవేశాన్ని కల్పిస్తారు. ప్రయాణికులకు విలాసవంతమైన సౌకర్యాన్ని అందించే ఉద్దేశంతో ప్రయాణికులు దీని సౌకర్యాలను బాగా ఆస్వాదించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నౌకలో ఉన్నవన్నీ విలాసవంతమైన సూట్ రూములే.

మూలాలు[మార్చు]

  • సాక్షి దినపత్రిక - 31-01-2015 (సముద్రంలో స్వర్గం!)