సేవమాను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Aphanamixis polystachya
Fruits of Aphanamixis polystachya
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
A. polystachya
Binomial name
Aphanamixis polystachya

సేవమాను యొక్క వృక్ష శాస్త్రీయ నామం Aphanamixis polystachya.

ఇతర భాషలలో ఈ చెట్టు పేరు[మార్చు]

సంస్కృతం : రోహితకః, హిందీ : హరిన్ హరా, కన్నడ : ముల్లుముంతల, మలయాళం : సెమ్మరం, తమిళం : మలంపులువం

వ్యాప్తి[మార్చు]

భారతదేశమంతటా హరితారణ్యాలలో సేవమాను పెరుగుతుంది.

వర్ణన[మార్చు]

18 నుండి 25 మీటర్ల ఎత్తుకు పెరిగే ఈ చెట్టు కాండం చాలా ఎత్తుగా ఉండి దీనిపైన గుబురుగా శాఖలు వ్యాపించి ఉంటాయి. దీని కాండం బెరడు లేత గోధుమ, లేక ముదురు గోధుమ రంగులో దళసరిగా బాగా గరుకుగా ఉంటుంది. ఈ కాండంపై ఆకులు ఉండవు. బెరడు గుండ్రంగా పెచ్చులు లేచినట్లు ఉంటుంది. దీని కాండం చెక్క ఎరుపుతో కూడిన గోధుమ రంగులో ఉంటుంది. దీని పెద్ద ఆకులు ఒక ఈనెకు ఇరువైపులా ఎదురెదురుగా ఉంటూ చివరికొసన ఒక ఆకు ఉంటుంది. ఈ ఆకులు సాధారణంగా 9 నుండి 17 వరకు ఉంటాయి. ఆకులు కొలగా బారుగా కొసతేలి ఉంటాయి. ఆకు రెండువైపులా నున్నగా ఉంటుంది. మగ పూవులు ప్రత్యేక ఈనెకు పూస్తాయి. ఆడ, లేక ద్విలింగ పుష్పాలు మగ పుష్పాల కంటే పెద్దవిగా ఉంటాయి. ఇవి ప్రత్యేకంగా ఒంటరిగా ఉంటాయి. కాయలు నున్నగా, పండినపుడు పసుపు పచ్చగా ఉంటాయి. ఎండినపుడు మూడు భాగాలుగా పగులుతుంది.

ఔషధీ ఉపయోగాలు[మార్చు]

దీని బెరడు నాలుకపై చురుకుదనం కలిగిస్తుంది. వగరుగా ఉంటుంది. ఇది గాయాలను మాన్పుతుంది. జీర్ణశక్తిని కలిగించుటకు, రక్తశుద్ధికి, మూత్రములో రక్తస్రావమును నిలుపు చేయుటకు, కంటి జబ్బుల నివారణకు, దేహ చల్లదనానికి మంచి మందు. లివర్ జబ్బులకు గడ్డలకు, వృణములకు, అజీర్ణము, చిన్న ప్రేగులలో పురుగులకు, చర్మ వ్యాధులకు, కుష్టు వ్యాధులకు, మధుమేహము, కంటి జబ్బులకు దివ్యౌషధము. దీని గింజలు కూడా విరేచనకారిగాను, దేహ చల్లదనానికి, కంటి జబ్బులకు, చెవి జబ్బులకు, వాత వ్యాధులకు మంచి మందు.

ఉపయోగపడు భాగాలు[మార్చు]

చెట్టు బెరడు, గింజలు

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

వనమూలికా వైద్యము

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సేవమాను&oldid=4025073" నుండి వెలికితీశారు