సైన్స్ ఫిక్షన్ కథలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సైన్స్ ఫిక్షన్ కథలు
పుస్తక ముఖచిత్రం
కృతికర్త: కస్తూరి మురళీకృష్ణ
అంకితం: రచయిత తల్లికీ, తండ్రికీ, విశ్వనాథ సత్యనారాయణకీ
ముఖచిత్ర కళాకారుడు: కృష్ణంరాజు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: కథా సాహిత్యం
విభాగం (కళా ప్రక్రియ): సైన్స్ ఫిక్షన్
ప్రచురణ: కె.పద్మ, కస్తూరి ప్రచురణలు
విడుదల: 2011
పేజీలు: 80

సైన్స్ ఫిక్షన్ కథలు ప్రసిద్ధి పొందుతున్న రచయిత కస్తూరి మురళీకృష్ణ రాసిన సైన్స్ ఫిక్షన్ విభాగానికి చెందిన కథల సంకలనం.

రచన నేపథ్యం[మార్చు]

కస్తూరి మురళీకృష్ణ రచించిన ఈ సైన్స్ ఫిక్షన్ కథలను కస్తూరి ప్రచురణలు సంస్థ ద్వారా ప్రచురించారు. ఈ సంకలనం 2011లో తొలి ముద్రణ పొందింది. ఆంధ్రభూమి మాసపత్రికలో పది కథలు ప్రచురణ పొందాయి. సైన్స్ ఫిక్షన్ విభాగానికి చెందాల్సిన కథలు ఇప్పటివరకూ ఉన్న సైన్స్‌ని ఆధారం చేసుకుని భవిష్యత్తును ఊహించాల్సి వస్తుందనీ ఈ కథలు రాసేందుకు సైన్స్‌లో ప్రస్తుతం జరుగుతున్న మార్పులను అవగాహన చేసుకునే రాసాననీ మురళీకృష్ణ అన్నారు.

ఇతివృత్తాలు[మార్చు]

బుధగ్రహ వాతావరణాన్ని చిత్రీకరిస్తూ ప్రయోగం, అంతర్జాల యుద్ధాలను ఆధారం చేసుకుని వైరస్‌తో యుద్ధం కథను, శనిగ్రహానికి ఉపగ్రహమైన టైటన్‌పై ఉండే జీవం నేపథ్యంగా టైటన్‌తో కరచాలనం, అంతర్జాలంలోని మోసాలు ఆధారంగా మిథ్యాసుందరి, యాంత్రిక వ్యవస్థను ప్రతీకాత్మకంగా చిత్రీకరించే కీక్ కీక్ కీక్, మనిషీ ఒక విధమైన రోబోనే అన్న ఊహను ప్రాతిపదికగా చేసుకుని నేనెవరిని కథలను రచించారు.[1]

శైలి, శిల్పం[మార్చు]

ప్రాచుర్యం, విమర్శ[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ముందుమాట:సైన్స్ ఫిక్షన్ కథలు:కస్తూరి మురళీకృష్ణ". Archived from the original on 2016-03-05. Retrieved 2014-04-16.