సైమన్ ప్లాంట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

14 కార్లను ఒకేసారి 18 అడుగుల రెండు అంగుళాల దూరం వరకూ లాగి ‘అత్యధిక కార్లు లాగిన వ్యక్తి’గా ప్రపంచ రికార్డు సృష్టించిన వ్యక్తి సైమన్ ప్లాంట్. సైమన్ బ్రిటన్‌లోని సౌత్ డెర్బీషైర్‌కు చెందిన వ్యక్తి, ఇతని వయస్సు 42 సంవత్సరాలు. కార్లు లాగడంలో దిట్ట అయిన ఇతను 22-10-2014న మొత్తం 20 టన్నుల బరువైన 14 ఫోర్ట్ ఫీస్టాస్ కార్లను తాడుతో లాగేసి డెర్బీలోని మెట్రోపాయింట్ వద్ద ఈ అద్భుత ఫీట్ సాధించాడు. గతంలో 12 కార్లను 15 అడుగులు లాగిన వ్యక్తి పేరు మీద ఈ రికార్డు ఉండగా ఆ రికార్డును బద్దలుకొట్టేందుకు సైమన్ దీనికి ముందు చేసిన రెండు ప్రయత్నాలతో సహా మొత్తం మూడు సార్లు ప్రయత్నించగా మూడో ప్రయత్నంలో ఈ ఫీట్ సాధించగలిగాడు. ఇతను 11 సంవత్సరాల క్రితమే 30 టన్నుల బరువున్న ట్రక్కును 100 అడుగుల దూరం లాగి అప్పుడు ప్రపంచ రికార్డు సృష్టించాడు.

మూలాలు[మార్చు]

  • సాక్షి దినపత్రిక - 27-10-2014 (14 కార్లు.. 18 అడుగులు..)
  • ఈనాడు దినపత్రిక - 27-10-2014 (14 కార్లను అవలీలగా లాగేసి ప్రపంచ రికార్డు సృష్టించిన సైమన్)