సొపిరాల
Jump to navigation
Jump to search
సొపిరాల | |
— రెవెన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15°42′N 80°15′E / 15.7°N 80.25°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | బాపట్ల జిల్లా |
మండలం | చినగంజాం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 523181 |
ఎస్.టి.డి కోడ్ |
సొపిరాల, బాపట్ల జిల్లా, చినగంజాం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ లలితా పరమేశ్వరీ శ్రీ రామకోటీశ్వరస్వామివారి దేవాలయం
[మార్చు]ఈ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించెదరు. ఆ రోజు తెల్లవారు ఝామున 3 గంటల నుండి అభిషేకాలు, ప్రత్యేక పూజలు మొదలుపెడతారు. ఈ సందర్భంగా భారీ విద్యుత్తు ప్రభలు తయారు చేస్తారు. రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. చుట్టు ప్రక్కల గ్రామాలనుండి గూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు.
శ్రీ సీతారామస్వామివారి ఆలయం
[మార్చు]ఆలయంలో నవమ వార్షిక దివ్య కల్యాణ మహోత్సవం, 2014, ఏప్రిల్-8, శ్రీరామనవమి నాడు, మద్యాహ్నం 12-03 గంటలకు, పుష్యమీ నక్షత్ర యుక్త మిధున లగ్నమండు జరిపి నారు. అనంతరం భక్తులకు కళ్యాణ విందు భోజనం ఏర్పాటుచేసారు. సాయంత్రం 7 గంటలకు శ్రీ సీతారామస్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు.
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కూరగాయలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు