Jump to content

సొసైటీస్ రిజిస్ట్రేషన్ విధానం

వికీపీడియా నుండి
ఉదాహరణగా ఒక సొసైటీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్

సొసైటీస్ రిజిస్ట్రేషన్ విధానం 1860లో బ్రిటిష్ పరిపాలనా కాలంలో అమలులోకి వచ్చింది. ఇది ఆనాటి బ్రిటిష్ పరిపాలిత ప్రాంతాల కోసం ర్రూపొందించబడింది. ఈనాటికీ భారతదేశంలో ఈ విధానం అమలులో ఉంది. సాహిత్య, శాస్త్రీయ, ధార్మిక సంఘాల నమోదుకు ఈ విధానం దోహద పడుతుంది.

ఈ విధానానుగుణంగా సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక మెమొరాండం ఆఫ్ అసోసియేషన్ (సంఘ నియమావళి) ని తయారు చేసుకొని, తద్వారా సంఘాన్ని ఏర్పరుచుకుంటారు. 7 లేదా అంతకన్నా ఎక్కువ వ్యక్తులు ఇలా సంఘంగా ఏర్పడవచ్చు. ఈ సంఘం కార్యకలాపాలు కూడా సాహిత్య, శాస్త్రీయ, ధార్మిక భావజాలాలతో కూడి ఉండాలి. సంఘ నియమావళిని రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ వద్ద నమోదు చెయ్యాలి. ఈ సంఘ నియమావళిలో సంఘ పేరు, లక్ష్యాలు, పాలకమండలి సభ్యుల పేర్లు, ఉద్యోగ వివరాలు, చిరునామాతో సహా ఉంటాయి. ఈ సంఘ నియమావళి పై సభ్యుల సంతకాలు విధిగా ఉండాలి. ఈ సంఘ నియమావళితో పాటు సంఘం యొక్క నియమాలు, నిర్దేశాల యొక్క నకలు ప్రతిని కూడా అందించాలి. రూ॥50/- ల రుశుము చెల్లించాల్సి ఉంటుంది.

బయటి లంకెలు

[మార్చు]