Jump to content

సోంపేట ఉద్యమం

వికీపీడియా నుండి

సోంపేట ఉద్యమం శ్రీకాకుళం జిల్లా, సోంపేట పరిసర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నాగార్జున కనస్ట్రక్షన్‌ కంపెనీ కలిసి తలపెట్టిన థర్మల్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగా 2008లో మొదలయిన ప్రజా ఉద్యమం.[1][2]

చరిత్ర

[మార్చు]

కోస్టల్ కారిడార్లో భాగంగా తీరప్రాంతంలో థర్మల్ పవర్ స్టేషన్లను స్థాపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008లో నిర్ణయించింది.

పోరాటం

[మార్చు]

ఉద్యమంలో భాగంగా ప్రజలు పలు రకాలుగా పోరాటం చేసారు.

రిలే నిరాహార దీక్ష

[మార్చు]

డిసెంబరు 4, 2009న ప్రారంభించిన రిలే నిరాహార దీక్షను 2166 రోజుల పాటు కొనసాగించి,2015 నవంబరు 9న ప్రభుత్వం జీవో ను రద్దుచేసిన తరువాత ముగించారు.[3]

ప్రస్తుత స్థితి

[మార్చు]

ప్రభుత్వం నాగార్జున కనస్ట్రక్షన్‌ కంపెనీకు భూమిని కేటాయిస్తూ ఇచ్చిన జీ.వో 1107ను రద్దు చేసినా, మరలా జీ.వో 329 ద్వారా, అదే సంస్థకు వేరే రకమైన పరిశ్రమలను అభివృద్ధి చేయటానికి అనుమతించింది.[4][5] దీనీని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ ఉద్యమంలో నిరసనలలో పాల్గొన్నందుకు 723 మందిపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయకపోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.[6]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "పర్యావరణ ఉద్యమాలకు సోంపేట ఆదర్శం". EENADU. Retrieved 2024-11-25.
  2. "దిశానిర్దేశంగా నిలిచిన 'థర్మల్‌' పోరాటం - Prajasakti" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-07-13. Retrieved 2024-11-25.
  3. Staff, T. N. M. (2015-11-10). "After six years and 2,166 days of hunger strike, Sompeta agitation ends in Andhra". The News Minute (in ఇంగ్లీష్). Retrieved 2024-11-25.
  4. ABN (2023-07-15). "ప్రపంచానికి దిక్సూచి సోంపేట థర్మల్‌ప్లాంట్‌ ఉద్యమం". Andhrajyothy Telugu News. Retrieved 2024-11-25.
  5. Staff, T. N. M. (2015-09-10). "Andhra returns Sompeta land to company for developing industry zone". The News Minute (in ఇంగ్లీష్). Retrieved 2024-11-25.
  6. Rao, K. Srinivasa (2023-08-17). "13 years post Sompeta stir in A.P., hundreds of families still being denied govt. jobs, passports, thanks to pending cases". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-11-25.