సోమదేవుడు
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
సోమదేవ భట్ట లేదా సోమదేవుడు 11వ శతాబ్దానికి చెందిన కాశ్మీర్ సంస్కృత రచయిత, కథాసరిత్సాగరము అనే విశేష ఆదరణపొందిన కథల గ్రంథకర్త.దీనిని 11వ శతాబ్దంలో సామాజిక జీవితానికి సంబంధించిన ఎన్సైక్లోపీడియా లేదా దర్పణం అని కూడా అంటారు.
జీవిత విశేషాలు
[మార్చు]అతని తలి తండ్రుల గురించి పెద్దగా తెలియలేదు. తండ్రి పేరు రామ భట్ట అని, అతను కాశ్మీర్ రాజు అయిన అనంతుని భార్య అయిన జలంధరా యువరాణి రాణి సూర్యమతి వినోదం కోసం అతను తన రచనలను (బహుశా 1063–1081 CEలో) రచించాడు అని తెలియుచున్నది. అప్పుడు కాశ్మీర్‌లో రాజకీయ పరిస్థితి అసంతృప్తి, కుట్రలు, రక్తపాతం, నిరాశతో కూడుకున్న సమయంగా భావించి రాణి చాలా కలత చెందింది. అందుకు గాను సోమదేవుడు తండ్రి రామ భట్ట ఆమె వినోదార్ధము కొన్ని రచనలు చేసినట్లు తెలియుచున్నది.సోమదేవుడు శైవ హిందూ బ్రాహ్మణుడు, బౌద్ధమతాన్ని చాలా గౌరవించేవాడు. తన కథాసరిత్సాగరలోని కొన్ని కథలు బౌద్ధ ప్రభావాలను చూపుతాయి.
గుణాడ్యుడు రచించిన బృహత్కథను ఆధారంగా క్షేమేంద్రుడు బృహత్కథామంజరిని రచించినాడో అదేవిధంగా సోమదేవుడు కథాసరిత్సాగరమును బృహత్కథ ఆధారంగా రచించాడు. క్షేమేంద్రుడిలాగే, సోమదేవుడు పదకొండవ శతాబ్దంలో కాశ్మీర్ రాజు అనంత్ స్థానంలో ఉన్నాడు. తన తండ్రిలానే అనంత రాజు భార్య సూర్యవతిని అలరించడానికి అతను కథల సాగరాన్ని రచించాడని చెబుతారు. సోమదేవుని కథలలో దీర్ఘమైన సమాసములు, కష్టమైన పద్యాలకు తక్కువేమీ ఉండదు. అందువల్ల, ఈ కథలలో సరళత ప్రత్యేకంగా కనిపిస్తుంది. బృహత్కథామంజరిలో కనిపించని అనేక కథలు కథాసరిత్సాగరంలో కనిపిస్తాయి. ఇందులో కొన్ని చిన్న కథలు మరికొన్ని పెద్దవిగా ఉన్నాయి. ఇందులో విభిన్న వ్యక్తులు, వివిధ దేశాల గురించి కథలు కూడా ఉన్నాయి. సోమదేవుడికి కథలు చెప్పడంలో అసమానమైన సామర్థ్యం ఉంది అని తెలియుచున్నది. ఒకప్పుడు భారతీయులకు రామాయణం, మహాభారతాలపై యెంత మక్కువ ఉండేదో, అలానే సోమదేవుడు కథాసరిత్సాగరముపైన కూడా అదేవింధంగా ఉండేది అని తెలియుచున్నది. అందువల్లనే ఈ కథాసరిత్సాగరము వివిధ భాషల్లోకి కూడా అనువదించబడింది.