సోమశిల ప్రాజెక్టు
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా సోమశిల వద్ద పెన్నా నదిపై నిర్మించిన భారీ సాగునీటి ప్రాజెక్టు సోమశిల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 1971లో ప్రారంభమైంది. ప్రస్తుతం దీనిలో 70 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం 4.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించటం, అయితే ఇంకా కాలువల తవ్వకాలు, ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నుంచి సాగునీటిని, తాగునీటిని అందించేందుకు నాలుగు కాలువలు ఉన్నాయి. వీటిలో ఒకటైన కావలి కాలువ ద్వారా 31 చెరువులకు నీటి సౌకర్యం ఏర్పడింది. ఈ కాలువ నుంచి ఖరీఫ్‌లో 10,400 హెక్టార్లకు, రబీలో 20,890 హెక్టార్లకు సాగునీరు అందుతోంది. వీటిలో మరొకటైన కనుపూరు కాలువ ద్వారా ఖరీఫ్‌లో 7,080 హెక్టార్లకు, రబీలో 18,200 ఎకరాలకు సాగునీరు అందుతోంది.
మూలాలు[మార్చు]
ఆధారం - ఈనాడు నెల్లూరు జిల్లా; 2020 నవంబరు 27, 1వ పేజీ.