సోమా మండల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోమా మండల్
జననం
వృత్తివ్యాపారవేత్త
సుపరిచితుడు/
సుపరిచితురాలు
పి.ఇ.ఎస్.బి. సభ్యురాలు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా మాజీ చైర్‌పర్సన్

సోమా మండల్ (ఆంగ్లం: Soma Mondal) స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAIL) మాజీ చైర్‌పర్సన్. ఆమె 2021 జనవరి 1 నుంచి 2023 ఏప్రిల్ 30 వరకు ఆ పదవిలో కొనసాగింది.[1] సోమా మండల్ సెయిల్ మొదటి మహిళా ఫంక్షనల్ డైరెక్టర్‌, అలాగే, మొదటి మహిళా ఛైర్మన్‌గా కూడా.[2][3][4] ఛైర్‌పర్సన్‌గానే కాకుండా ఆమె కార్పొరేషన్‌కి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా కూడా ఉంది.[5] సెయిల్ నుండి పదవీ విరమణ తర్వాత, ప్రస్తుతం పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ సెలక్షన్ బోర్డ్‌లో ఆమె సభ్యురాలుగా ఉంది.[6] పరిశ్రమకు ఆమె చేసిన అపారమైన కృషికి క్వీన్ ఆఫ్ స్టీల్ అని గుర్తింపు తెచ్చుకుంది.[7]

నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌(నాల్కో)లోకి గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీగా అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ తొలి మహిళా డైరెక్టర్‌(కమర్షియల్‌) స్థాయికి చేరింది. 2017లో స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సెయిల్‌)లోకి వచ్చిన తరువాత ఫస్ట్‌ ఉమెన్‌ ఫంక్షనల్‌ డైరెక్టర్, ఫస్ట్‌ ఉమెన్‌ చైర్‌పర్సన్‌ ఆఫ్‌ సెయిల్‌గా ప్రత్యేక గుర్తింపు పొందింది.

సోమా మండల్ 2022, 2023లలో వరుసగా ఆమె పేరు ఫోర్బ్స్(Forbes) ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చేర్చబడింది.[8]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

సోమ మండల్ భువనేశ్వర్‌లోని ఓ బెంగాలీ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది.[9] ఆమె తండ్రి వ్యవసాయ ఆర్థికవేత్త. అప్పట్లో సమాజంలో నెలకొని ఉన్న ఆడపిల్లలు ఒక స్థాయి వరకు చదివితే చాలు అనే భావన కాకుండా ఆయనకు సోమ మండల్ ను పెద్దచదువులు చదివించాలనే తపన ఉండేది. అయితే సోమా మండల్ ఇంజనీరింగ్‌ చేయాలనుకున్నప్పుడు మాత్రం కుదరదు అని చెప్పేసాడు. కారణం, ఆరోజుల్లో అమ్మాయిలు ఇంజినీరింగ్‌ చదవడం అరుదు. తల్లి సహాయంతో నాన్న మనసు మారేలా చేసిన ఆమె 1984లో రూర్కెలాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసింది.[10] అక్కడ, ఆమె బ్యాచ్‌లో మొత్తం రెండు వందల మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు మాత్రమే అమ్మాయిలు కావడం గమనార్హం.

కెరీర్

[మార్చు]

మెటల్ పరిశ్రమలో ఆమెకు 35 సంవత్సరాల అనుభవం ఉంది. మెటల్‌ ఇండస్ట్రీలో సోమా మండల్ అడుగు పెట్టినప్పుడు మహిళా ఉద్యోగులు ఎక్కువగా లేరు. మెటల్‌ ఇండస్ట్రీ అంటే పురుషుల ప్రపంచం అన్నట్లుగా ఉండేది. అయినా, ఆమె నాల్కో(NALCO)లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీగా తన వృత్తిని ప్రారంభించింది. 2014 సంవత్సరంలో నాల్కోలో డైరెక్టర్ (కమర్షియల్) మాంటిల్‌ని కైవసం చేసుకునేందుకు ర్యాంకుల ద్వారా ఎదిగింది. ఆమె మార్చి 2017లో సెయిల్‌లో డైరెక్టర్ (కమర్షియల్)గా చేరింది. ఆమె డిసెంబరు 2020లో పదవీ విరమణ చేసిన అనిల్ కుమార్ చౌదరి నుండి మహారత్న పి.ఎస్.యు.(Public sector undertakings) చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించింది.[11][12][13] ఆమె పదవీ కాలంలో, 2022 ఆర్ధిక సంవత్సరంలో, సెయిల్ మొదటిసారిగా రూ. 1 లక్ష కోట్ల ఆదాయ మైలురాయిని అధిగమించి, భారతీయ కంపెనీల ఎలైట్ క్లబ్‌లోకి ప్రవేశించింది.

ఆమె సెయిల్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన కాలంలో ఆ సంస్థ వేల కోట్ల అప్పులతో ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెటింగ్‌ ఆర్గనైజేషన్‌ స్ట్రక్చర్‌లో ఆమె పలు మార్పులు తీసుకువచ్చింది. సెయిల్‌ ప్రాడక్ట్స్‌ను ప్రమోట్‌ చేయడానికి మార్గాలు అన్వేషించింది. ఆమె గ్రామీణ ప్రాంతాలలో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. ఆమె కొత్త వ్యాపార వ్యూహాలను అనుసరించి కంపనీ అప్పులు తగ్గించుకుంటూ లాభాల దిశగా నడిపించింది. వివిధ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి, పంపిణీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి వ్యూహాలను రూపొందించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. సెయిల్ కంపెనీకి సంబంధించిన సమగ్ర టర్నరౌండ్ రోడ్‌మ్యాప్ ఆధారంగా మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేయడంలో ఆమె ముందంజలో ఉంది, ఇది సెయిల్ ఉత్పత్తుల అమ్మకాలు, మార్కెట్ విస్తరణకు దోహదపడింది. సెయిల్ లక్ష కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ సాధించగలిగింది.[14]

ఆమె వివిధ పరిశ్రమల ఫోరమ్‌లలో తన సహకారం కోసం అల్యూమినియం పరిశ్రమలో ప్రసిద్ధి చెందింది.[15] మార్చి 2021లో సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ అయిన స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (స్కోప్) చైర్‌పర్సన్‌గా ఆమె ఎన్నికయ్యింది.[16][17][18]

2023లో, ఈటిప్రైమ్(ETprime) ఉమెన్ లీడర్‌షిప్ అవార్డులలో ఆమెను 'సీయీఓ ఆఫ్ ది ఇయర్' బిరుదుతో సత్కరించారు.[19]

మూలాలు

[మార్చు]
  1. Standard, Business (31 May 2023). "Amarendu Prakash takes over as SAIL chairman, succeeds Soma Mondal". Business News, Finance News, India News, BSE/NSE News, Stock Markets News, Sensex NIFTY, Union Budget 2023. Retrieved 7 December 2023. {{cite web}}: |first= has generic name (help)
  2. Surojit Gupta (13 Aug 2020). "SAIL's Soma Mondal set to breach steel ceiling - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-08-30.
  3. "Soma Mondal takes over as Chairperson of SAIL". @businessline (in ఇంగ్లీష్). January 2021. Retrieved 2021-09-26.
  4. "Soma Mondal scripts history, assumes charge as 1st female Chairperson of SAIL". psuwatch.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2 January 2021. Retrieved 2021-09-26.
  5. "Soma Mondal scripts history, assumes charge as 1st female Chairperson of SAIL". psuwatch.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2 January 2021. Retrieved 2021-09-26.
  6. "Board Structure". Public Enterprises Selection Board (in హిందీ). Retrieved 7 December 2023.
  7. "Soma Mondal: క్వీన్‌ ఆఫ్‌ స్టీల్‌ | Soma Mondal: A trailblazer on Forbes' Most Powerful Women list - Sakshi". web.archive.org. 2024-02-08. Archived from the original on 2024-02-08. Retrieved 2024-02-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. "Who is Soma Mondal? The 'Queen of Steel' who is among World's Most Powerful Women". The Economic Times. 2023-12-06. ISSN 0013-0389. Retrieved 2023-12-08.
  9. "Soma Mondal: Odisha's first woman to head Steel Authority of India". Utkal Today. 2021. Archived from the original on 2021-12-16. Retrieved 2024-02-08.
  10. Mazumdar, Rakhi. "PESB picks Soma Mondal as the next chairman of Steel Authority of India". The Economic Times. Retrieved 2021-09-26.
  11. Pandey, Manohar (2021-04-08). General Knowledge 2022 (in ఇంగ్లీష్). Arihant Publications India limited. ISBN 978-93-252-9558-2.
  12. "Smt. Soma Mondal | SAIL". sail.co.in. Retrieved 2021-08-30.
  13. "Soma Mondal scripts history, assumes charge as 1st female Chairperson of SAIL". psuwatch.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2 January 2021. Retrieved 2021-09-26.
  14. "Who is Soma Mondal? The 'Queen of Steel' who is among World's Most Powerful Women". The Economic Times. 2023-12-06. ISSN 0013-0389. Retrieved 2023-12-08.
  15. Mazumdar, Rakhi. "PESB picks Soma Mondal as the next chairman of Steel Authority of India". The Economic Times. Retrieved 2021-09-26.
  16. Divekar, Aditi (2021-03-26). "SAIL chief Soma Mondal is new chairperson of SCOPE". Business Standard India. Retrieved 2021-09-26.
  17. "Soma Mondal elected as SCOPE Chairperson". @businessline (in ఇంగ్లీష్). 26 March 2021. Retrieved 2021-09-26.
  18. "Chairman, SAIL Soma Mondal elected as new Chairman, SCOPE". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2021-09-26.
  19. "ETPrime Women Leadership Awards 2023". The Economic Times (in ఇంగ్లీష్).