సోమ

వికీపీడియా నుండి
(సోమి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Bottle of Ephedrine, an alkaloid found in Ephedra
Mormon Tea (Ephedra funerea) growing in the wild in the Fiery Furnace area of Arches National Park near Moab, Utah.

సోమ (సంస్కృతము) లేక హఓమ (అవెస్తన్) తొలి ఇండో-ఇరానియన్ భాషకు చెందిన పదము "స ఓ మ" నుండి ఉత్పత్తి చెందిన పేరు. సోమ రసము ఆగమ సంబంధము గల పానీయము. తొలి వైదిక, పారశీకుల సంస్కృతులలో సోమరసానికి బహుళ ప్రాముఖ్యత గలదు. ఋగ్వేదములోని సోమ మండలంలో పెక్కు మంత్రములలో సోమరసము యొక్క శక్తి ప్రథమగు గుణముల గురించి ప్రసక్తి ఉంది. అవెస్తలో ఒక యష్త్ పూర్తిగా హఓమ గురించే ఉంది.

వృక్ష శాస్త్రజ్ఞుల ప్రకారము సోమ Ephedra అను మొక్క. మరి కొన్ని అభిప్రాయముల ప్రకారము నీల కమలము, Amanita, Cannabis (భంగ్), తేనె సోమగా పరిగణించ బడ్డాయి. సోమరసము కాండమునుండి తీయబడుతుంది. వైదిక, జోరాష్ట్రియన్ సంప్రదాయములో సోమరసమునకు దైవత్వము కూడా అపాదింపబడింది.

వ్యాప్తి

[మార్చు]

సోమలత బీహార్, బెంగాల్, దక్షిణ భారతంలో మెట్ట, కొండ ప్రదేశాలలో పెరుగుతుంది.

మొక్క వర్ణన

[మార్చు]

ఆకులు లేకుండా ఆకుపచ్చ సన్న కాండంతో శాఖలుగా విస్తరించి అల్లుకునే లేత పొద. ఈ కాండం సన్నని మెత్తని తీగల వలె చెట్ల కొమ్మలకు అల్లుకుని ప్రాకుతుంది. దీని నుండి తెల్లని పాలు వస్తాయి. పూవులు తెలుపుగా లేక లేత ఆకు పచ్చగా ఉంటాయి. సువాసన వెదజల్లుతుంటాయి. కాయలు పల్చగా మందపాటి ఆకులవలె చివర కొసగా ఉంటాయి. గింజలు పల్లిగా కోలగా ఉంటాయి.

ఔషధ లక్షణాలు

[మార్చు]

మొక్క రుచి చేదుగా, కారంగా ఉంటుంది. కాశసిధిని కలిగిస్తుంది. దోషములను పోగొడుతుంది. పూర్ణ వయస్సు, ఆయురారోగ్యములను ఇస్తుంది. నిద్రను, వాంతులను కలిగిస్తుంది. వైరల్ వ్యాధులను నిరోధిస్తుంది. అజీర్తి, హైడ్రోసొబియా, మానసిక వ్యాధులకు, బలహీనతలపై పనిచేస్తుంది.

ఉపయోగపడు భాగాలు

[మార్చు]

మొత్తం మొక్క.

భాషా విశేషాలు

[మార్చు]

బ్రౌన్ నిఘంటువు ప్రకారం సోమ [ sōma ], సోతలత or సోమవల్లి sōma. సంస్కృతం n. The moon plant, Asclepias acida, or A. aphylla, పుల్లతీగె, తిప్పతీగె.[1] సోమపానము drinking the juice of the Asclepias. సోమధార sōma-dhāra. n. The heavenly Ganges, ఆకాశగంగ. సోమపీథి, సోమపీతి or సోమవుడు sōma-pīthi. n. One who drinks the juice of the Asclepias. యజ్ఞములో సోమరసముత్రాగువాడు. సోమయాజి sōma-yāji. n. A sacrificer, యజ్ఞము చేసినవాడు.

వైదిక సోమ

[మార్చు]

వేదములలో సోమ పవిత్రమైనది. సోమకు దైవత్వము కూడా ఆపాదింపబడింది. వేదములలోని రెండు పవిత్ర పానీయములలో సోమ అమృతమగు ఆత్మను, అమృతము అమృతమగు దేహమును ప్రసాదిస్తాయి. ఇంద్ర, అగ్ని సోమరసమును మిగుల త్రాగెడివారు. మానవులు సోమరసము త్రాగుటవల్ల వారికి దైవగుణములు వస్తాయని నమ్మిక. ఋగ్వేదము ఏడవ మండలాన్ని సోమ మండలం అంటారు. ఇందులోని మంత్రములన్నీ 'సోమ పవమాన' పైనే ఉంటాయి. గంధర్వులు సోమను ఇతరులకు పంచుతారు. ఋగ్వేదము సుషోమ, అర్జికీయ ప్రాంతములను సోమ దొరకు స్థానములుగా గుర్తించింది.

సోమ పర్వతములపై పెరుగు మొక్కగా వర్ణించబడింది. ఈ మొక్క పొడవాటి పసుపు రంగు కాండములు కలిగి ఉంటుంది. కాండములను రాతితో దంచగా ద్రవించు రసమును పాలు, ఇతర పదార్థములు కలిపి త్రాగెడివారు. ప్రాచీన కాలములో దేవతల రాజ్యములో అన్ని దేవాలయమలలో సోమ రసము చేయు గానుగలు ఉండెడివి. అసురులను ఎదుర్కొనుటకు వారికి ఇది చాల ఉపయోగపడేది. కాలక్రమమున సోమ రసములో కలుపు పదార్ధముల గురించిన జ్ఞానము కోల్పోవడము జరిగింది. సోమ మొక్క కూడా దొరకుట అరుదైనది.

హైందవ సోమ

[మార్చు]

హిందూ మతము (ధర్మము) లో సోమ దేవత చంద్ర దేవతగా చూడబడ్డాడు. ఈ కారణమువల్ల సోమరసము పూర్ణిమ దినమున తీయబడుతుంది. సోమరసము చంద్రుని అకారములో గల గిన్నె నుండి సేవించబడుతుంది. సోమునకు ఇరువదిఏడు భార్యలున్నారు. వీరు దక్షుని కుమార్తెలు. నక్షత్రముల పేర్లు గల వారు. సోముడు రోహిణి అను భార్యపై ఎక్కువ మక్కువతో ఉన్నాడని మిగతా భార్యలు దక్షునికి మొర పెట్టుకొనగా, దక్షుడు సోముని క్షీణించి మరణించునటుల శపిస్తాడు. భార్యలు మరల వేడుకొనగా సోముడు క్షీణించుతూ, మరలా పెరుగుతూ ఉండునటుల దక్షుడు తన శాపాన్ని ఉపసంహరిస్తాడు. భారతీయ కాలమానములో సోమవారము సోముని పేరుమీద చిరస్థాయిగా నిలచిపోయింది. సోమదేవత చిత్రములలో వృషభము లేక పక్షిగా చిత్రీకరింపబడినాడు.

శుశ్రుత సంహితలో శ్రేష్ఠమగు సోమ కాశ్మీరములో, సింధూ నది ఎగువ ప్రాంతములోను దొరకునని ఉదహరించబడింది.

అవెస్త హవోమ

[మార్చు]

పాశ్చాత్య సాహిత్యము

[మార్చు]

ఆధునిక సోమ

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
  • Bakels, C.C. 2003. “The contents of ceramic vessels in the Bactria-Margiana Archaeological Complex, Turkmenistan.” in Electronic Journal of Vedic Studies, Vol. 9. Issue 1c (May 2003)
  • Jay, Mike. Blue Tide: The Search for Soma. Autonomedia, 1999.
  • Lamborn Wilson, Peter. Ploughing the clouds:The search for Irish Soma, City Lights,1999.
  • McDonald, A. "A botanical perspective on the identity of soma (Nelumbo nucifera Gaertn.) based on scriptural and iconographic records" in Economic Botany 2004;58

మూలాలు

[మార్చు]
  • (Wasson, Robert Gordon (1968). "Soma: Divine Mushroom of Immortality". Ethno-Mycological Studies (New York) 1. ISBN 0-15-683800-1.)
  • Furst, Peter T. (1976). Hallucinogens and Culture. Chandler & Sharp. pp. 96–108. ISBN 0-88316-517-1.
  • Aitchison, 1888
  • Oldenberg, Hermann (1988). The Religion of the Veda. ISBN 978-81-208-0392-3.
  • Hendel v World Plan Executive Council, 124 WLR 957 (January 2, 1996); affd 705 A.2d 656, 667 (DC, 1997)
  • M. Mayrhofer, Etymologisches Wörterbuch des Altindoarischen, Heidelberg 1986–2000, vol II: 748
  • K.F.Geldner, Der Rig-Veda. Cambridge MA, 1951, Vol. III: 1-9
  • Booth, Martin (2005). Cannabis: A History. Picador. ISBN 978-0-312-42494-7. Retrieved 2009-04-25.* Teeter, Donald E. (2005, 2007). Amanita Muscaria; Herb of Immortality. 4800 Yager Lane, Manor, Texas 78653 ambrosiasociety.org: Ambrosia Society.
  • Sushruta Samhita: 537-538, SS.CS. 29.28-31.
  • "Botany of Haoma", from Encyclopædia Iranica. Accessed March 15, 2007
  • "Somayagam to be conducted at Aluva". The Hindu. 2009-02-08.
  • Williamson, Lola, Transcendent in America: Hindu-Inspired Meditation Movements as New Religion", NYU Press, 2010 ISBN 0-8147-9450-5, ISBN 978-0-8147-9450-0, pp. 99–100
  • Doniger, Wendy, The Hindus, An Alternative History, Oxford University Press, 2010, ISBN 978-0-19-959334-7, pbk
  • Angot, Michel, L'Inde Classique, Les Belles Lettres, Paris, 2001, ISBN 2-251-41015-5
  • http://www.youtube.com/watch?v=wBOMXVNqh5A
  • http://siddham.in/somalatha-sarcostemma-acidum
  • C.C. Bakels, Report concerning the contents of a ceramic vessel found in the "white room" of the Gonur Temenos, Merv Oasis, Turkmenistan. EJVS Vol.9, 2003 [1]
  • soma. CollinsDictionary.com. Collins English Dictionary - Complete & Unabridged 11th Edition. Retrieved December 02, 2012.
"https://te.wikipedia.org/w/index.php?title=సోమ&oldid=2904374" నుండి వెలికితీశారు