Jump to content

సోమేశ్వరపురం

వికీపీడియా నుండి
సోమేశ్వరపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం బోగోలు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

సోమేశ్వరపురం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ఈ గ్రామంలో ఉన్న పురాతన సోమేశ్వరాలయం శిధిలమైపోవడంతో , 40 ఏళ్ళుగా గ్రామాన్ని, "దేవళంపాడు" గా పిలవటం అలవాటయిపోయింది. గ్రామస్థులు, దాతలు, దేవాదాయ శాఖ కృషి ఫలితంగా, సోమేశ్వరాలయం జీర్ణోద్ధరణ పనులు దాదాపు పూర్తికావచ్చినవి. త్వరలో విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. దీనితో గ్రామాన్ని ఇకపై "సోమేశ్వరపురం" అని పిలుచుకునే అవకాశం ఏర్పడింది. రాజుల కాలంలో నిర్మించిన సోమేశ్వరాలయానికి 40 ఏళ్ళనుండి ఆలనా పాలనా కరువై, శిధిలావస్థకు చేరింది. కోట్ల రూపాయల విలువైన 110 ఎకరాల మాన్యం భూమి ఉన్నా, ఆదరణ కరువైనది. స్థానికులే ఉద్యమం నడిపారు. అప్పుడు దేవాదాయ శాఖ 11 లక్షలు మంజూరు చేయగా, దాతలు పెద్ద ఎత్తున స్పందించి, చేయూతనివ్వగా జీర్ణోద్ధరణ పనులు దాదాపు పూర్తయినవి.[1]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు నెల్లూరు; జనవరి-8,2013; 5వ పేజీ.