సోలార్ ఇంపల్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2009 డిసెంబరు 3 న దుబెన్‌డోర్ఫ్ లో తన మొదటి "ఫ్లీ హాప్" టెస్ట్ ఫ్లైట్ సమయంలో సోలార్ ఇంపల్స్ 1.
సోలార్ ఇంపల్స్-2 (HB-SIB).

సోలార్ ఇంపల్స్ అనేది స్విట్జర్లాండ్కు చెందిన ఒక సుదూర సౌర శక్తి విమానం ప్రాజెక్ట్.

సోలార్ ఇంపల్స్-2

[మార్చు]

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సౌర విద్యుత్‌తో సుదీర్ఘ ప్రయాణం చేయగలిగిన సామర్థ్యమున్న విమానం 'సోలార్ ఇంపల్స్-2' ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైంది. 2015 మార్చిలో ప్రపంచాన్ని చుట్టిరానున్న ఈ విమానం భారత్‌లోనూ అడుగుపెట్టనుంది, దాదాపు పూర్తిగా సౌర విద్యుత్‌తో నడిచే ఈ విమానాన్ని 2-6-2014న స్విట్జర్లాండ్‌లో ఆవిష్కరించి, ప్రయోగాత్మకంగా నడిపిచూశారు. రాత్రీ, పగలూ కూడా నడవగలిగిన ఈ విమానాన్ని జర్మనీకి చెందిన పైలట్ మార్కస్ షెర్డెల్ 2-6-2014న దాదాపు 2 గంటల 17 నిమిషాలపాటు నడిపారు. కేవలం ఒక్కరు మాత్రమే కూర్చోగలిగిన ఈ విమానం రెక్కలు మాత్రం బోయింగ్-747 కంటే పెద్దగా 72 మీటర్ల వెడల్పుతో ఉంటాయి. బరువు మాత్రం అతి తక్కువగా కేవలం 2,300 కిలోలు. దాదాపు వరుసగా 120 గంటలపాటు పగలు, రాత్రీ తేడాలేకుండా ప్రయాణించగలిగే సామర్థ్యాన్ని సాధించడమే 'సోలార్ ఇంపల్స్-2' లక్ష్యమని, దీనితో ప్రపంచాన్ని చుట్టిరానున్నామని విమాన రూపకర్తలు, సోలార్ ఇంపల్స్ సంస్థ వ్యవస్థాపకులు ఆండ్రె బోర్చ్‌బెర్గ్, బెర్ట్రాండ్ పిక్కార్డ్ చెబుతున్నారు. పలుమార్లు విజయవంతంగా నడపబడిన సోలార్ ఇంపల్స్-2 విమానం 09-03-2015 న అబుదాబీ నుంచి 35 వేల కి.మీ సాగే ప్రపంచయాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ విమానం 5 నెలల్లో 25 రోజుల పాటు ఎగిరి జూలై చివరలో తిరిగి అబుదాబీకి చేరుకోనుంది. ఈ సుదీర్ఘయాత్రకు సోలార్ ఇంపల్స్ సీఈవో బోర్ష్‌బర్గ్ తొలి పైలట్ గా, ఈ సంస్థ సహవ్యవస్థాపకుడు పికార్డ్ రెండో పైలట్ గా వ్యవహరిస్తున్నారు.

సోలార్ ఇంపల్స్-2 విశేషాలు

[మార్చు]
  • ఈ విమానంలో ఉండేది ఒక సీటు మాత్రమే.
  • బరువు 2,300 కిలోలు
  • ఒక్కో రెక్క పొడవు 72 మీటర్లు.
  • సౌర శక్తితో మాత్రమే నడిచే ఈ విమానం యొక్క రెండు రెక్కలపై మొత్తం 17,248 సోలార్ సెల్స్ ఉంటాయి.
  • సౌరశక్తి ద్వారా నడిచే 4 ఎలక్ట్రికల్ మోటార్లు ప్రొపెల్లర్స్ ను తిప్పుతాయి. సౌరశక్తిని నిల్వచేయడానికి నాలుగు లిథియం పాలిమర్ బ్యాటరీలు ఉంటాయి.
  • కార్బన్ ఫైబర్ తో తయారైన ఈ విమానం యొక్క ప్రస్తుత గరిష్ఠ వేగం గంటకు 45 కి.మీ.
  • ఈ విమానం సముద్రంపై పగలు 8,500 మీటర్ల ఎత్తులో, రాత్రులు 1,500 మీటర్ల ఎత్తులో ఎగురుతూ ప్రయాణిస్తుంది.
  • ఈ విమానం పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాల మీదుగా ప్రయాణించునప్పుడు ఐదు రాత్రులు, ఐదు పగళ్లూ ఎక్కడా ఆగకుండా ప్రయాణిస్తుంది.

వివరణాత్మక మార్గం

[మార్చు]
Leg ప్రారంభ సమయం ప్రారంభ స్థానం గమ్యం దూరం ఎగిరిన సమయం సగటు వేగం పైలట్
1 9 March 2015 03:12 UTC యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ Abu Dhabi, UAE ఒమన్ Muscat, Oman 733 km[ఆధారం చూపాలి] 13h 1' 56.3 km/h (30.4 kn) André Borschberg
2 10 March 2015 02:35 UTC ఒమన్ Muscat, Oman భారతదేశం అహ్మదాబాద్, భారతదేశం Bertrand Piccard
3 భారతదేశం అహ్మదాబాద్, భారతదేశం భారతదేశం వారణాసి, భారతదేశం
4 భారతదేశం వారణాసి, భారతదేశం మయన్మార్ Mandalay, Myanmar
5 మయన్మార్ Mandalay, Myanmar చైనా Chongqing, China
6 చైనా Chongqing, China చైనా Nanjing, China
7 చైనా Nanjing, China యు.ఎస్.ఏ Hawaii, USA
8 యు.ఎస్.ఏ Hawaii, USA యు.ఎస్.ఏ Phoenix, USA
9 యు.ఎస్.ఏ Phoenix, USA యు.ఎస్.ఏ TBD (mid-USA)
10 యు.ఎస్.ఏ TBD (mid-USA) యు.ఎస్.ఏ New York, USA
11 యు.ఎస్.ఏ New York, USA TBD (Southern Europe or Morocco)
12 TBD (Southern Europe or Morocco) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ Abu Dhabi, UAE

మూలాలు

[మార్చు]
  • సాక్షి దినపత్రిక - 2-6-2014
  • సాక్షి దినపత్రిక - 10-03-2015 - (చుక్క ఇంధనం లేకుండా.. ప్రపంచయాత్ర!)