Jump to content

సౌభాగ్య (పత్రిక)

వికీపీడియా నుండి
సౌభాగ్య
వర్గాలుస్తీల సంక్షేమ పత్రిక
తరచుదనంమాసపత్రిక
ముద్రణకర్తడైరెక్టర్, ఆంధ్రప్రభుత్వ మహిళా సంక్షేమశాఖ, మద్రాసు
మొదటి సంచిక1945
దేశంభారతదేశం
భాషతెలుగు

ఈ మాసపత్రిక మద్రాసు ప్రభుత్వం వారి స్త్రీజనాభ్యుదయ శాఖ ప్రారంభించింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆంధ్ర రాష్ట్ర మహిళా సంక్షేమశాఖ ఈ పత్రికను కొనసాగించింది. స్త్రీల విజ్ఞాన వికాసాలకు తోడ్పడే రచనలు దీనిలో ప్రచురింపబడ్డాయి. మద్రాసు నుండి ఈ పత్రిక వెలువడింది. 1945లో ప్రారంభమైన ఈ పత్రిక సుమారు 13 సంవత్సరాలు నడిచింది.

రచయితలు

[మార్చు]

ఈ పత్రికలో చల్లా రాధాకృష్ణశర్మ, దాసరి వేంకటకృష్ణయ్య, బి.వి.సింగరాచార్య, కె.రామశాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు, శ్రీనివాస కాశ్యప, తిమ్మావఝల కోదండరామయ్య, టేకుమళ్ళ కామేశ్వరరావు, జె.జమునాబాయి, వేమరాజు భానుమూర్తి, కళా వెంకటరావు, వి.టి.కృష్ణమాచారి, కన్నెగంటి వీరభద్రాచార్యులు, పద్మాబాయి, దుర్గాబాయి దేశ్‌ముఖ్, భూషణం, శ్రీపాద వెంకటరత్నం, పాలంకి వెంకట రామచంద్రమూర్తి, కె.సభా, వాసిరెడ్డి సీతాదేవి, దిగుమర్తి సాంబశివరావు, చెన్నఘంటమ్మ కృష్ణారావు, సహదేవ సూర్యప్రకాశరావు మొదలైన రచయితల రచనలు ప్రచురింపబడ్డాయి[1].

రచనలు

[మార్చు]

ఈ పత్రిక మొదటి పేజీలో యత్ర నార్యంతు పూజ్యతే, రమంతే తత్ర దేవత అనే వాక్యాన్ని ప్రచురించేవారు. ఈ పత్రికలో మహిళల వికాసానికి సంబంధించిన వార్తలు, ప్రభుత్వ సంక్షేమ సంబంధిత వార్తలు, విజ్ఞాన సంబంధమైన విషయాలు, ఆరోగ్య విషయలకు చెందిన వ్యాసాలు, కవితలు, కథలు, నాటికలు, స్త్రీల పాటలు, అనువాద రచనలు, రంగవల్లులు మొదలైనవి ప్రచురింపబడ్డాయి.

మూలాలు

[మార్చు]