సౌమిలీ బిస్వాస్
సౌమిలీ బిస్వాస్ | |
---|---|
జననం | 29 సెప్టెంబరు కలకత్తా, పశ్చిమ బెంగాల్, భారతదేశం |
జాతీయత | భారతీయురాలు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | నటి, మోడల్, డ్యాన్సర్ |
జీవిత భాగస్వామి | అయాన్ ఘోష్ (2012) |
సౌమిలీ బిస్వాస్, బెంగాలీ టివీ, సినిమా నటి, మోడల్, యాంకర్, శాస్త్రీయ నృత్య కళాకారిణి.[1] 2003లో వచ్చిన అలో సినిమాలోని సహాయక పాత్రలో తొలిసారిగా నటించింది. తారా బంగ్లాలో సిలబస్-ఇ నీ అనే నాన్-ఫిక్షన్, స్టూడెంట్-బేస్డ్ షో యాంకర్‌గా టివీరంగంలోకి అడుగుపెట్టింది.[2] 2007లో, ఈటివీ బంగ్లా దుర్గే దుర్గతినాశినిలో దుర్గాదేవి పాత్రను పోషించింది.[3] జీ బంగ్లాలో అత్యంత ప్రజాదరణ పొందిన బెంగాలీ డాన్స్ రియాలిటీ షో డాన్స్ బంగ్లా డ్యాన్స్ సీజన్లకు మెంటార్‌గా పనిచేస్తోంది. 2021, ఫిబ్రవరి 17న భారతీయ జనతా పార్టీలో చేరింది.
జననం, విద్య
[మార్చు]సౌమిలీ సెప్టెంబరు 29న దక్షిణ కోల్‌కతాలోని బరిషా/బెహలాలో జన్మించింది. కోల్‌కతాలోని బెహలాలోని బిద్యా భారతి బాలికల పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన సౌమిలీ, కలకత్తా విశ్వవిద్యాలయంలోని జోగమాయా దేవి మహిళా కళాశాల నుండి ఆర్థికశాస్త్రం (ఆనర్స్)లో పట్టభద్రురాలైంది.
నృత్యరంగం
[మార్చు]మూడు సంవత్సరాల వయస్సు నుండి భరతనాట్యంలో శిక్షణ నేర్చుకొని, తరువాత తంకమణి కుట్టి, మమతా శంకర్ ల దగ్గర బ్యాలెట్‌లో శిక్షణ పొందింది. కోల్‌కతా, ఇతర ప్రాంతాలలో నృత్య నాటకాలు, సోలో, గ్రూప్ క్లాసికల్ ప్రదర్శనలలో పాల్గొన్నది. భరతనాట్యంలో సంగీత రత్న, సంగీత్ బిభాకర్ అవార్డులను అందుకుంది.[1][4][5]
వ్యక్తిగత జీవితం
[మార్చు]2012 డిసెంబరులో బ్యాంకింగ్ ప్రొఫెషనల్ అయిన అయాన్ ఘోష్‌తో సౌమిలీ వివాహం జరిగింది.
సినిమాలు
[మార్చు]- అలో (2003) - సహాయ నటి
- గ్యరకల్ (2003) - దిశా, సహాయ నటి
- సంగ్రామ్ (2005) - సహాయ నటి
- ఆశా (2006) - ప్రధాన పాత్ర
- అగ్నిశపత్ (2006)
- బాజిమాత్ (2008) - సహాయ నటి
- యూ-టర్న్ (2010) - ప్రధాన పాత్ర
- అగ్నిసాక్షి (2011) - సహాయ నటి
- తీన్ తనయ (2011) - సహాయ నటి
- సుధు తోమాకే చాయ్ (2013) - ప్రధాన పాత్ర (దీపా)
టెలివిజన్
[మార్చు]- ఝుమ్ తరా రా ( జీ బంగ్లా )
- సిలబస్-ఇ నెయి (తారా బంగ్లా)
- కోన్ కనోనర్ ఫూల్ ( జీ బంగ్లా )
- సోమోయ్ ( రూపోషి బంగ్లా )
- జాయ్ బాబా లోకేనాథ్ (జీ బంగ్లా)
మహాలయ
[మార్చు]- 2007 ఈటివీ (కలర్స్) బంగ్లా మహాలయా దేవి మహిసాసురమర్దిని
- 2008 డిడి బంగ్లా మహాలయా దేవి మహిషాసురమర్దిని
రియాలిటీ షోలు
[మార్చు]- రాన్నాఘోర్ (జీ బంగ్లా)
- దీదీ నం. 1 (జీ బంగ్లా)
- డ్యాన్స్ బంగ్లా డాన్స్ (మెంటార్‌గా జీ బంగ్లా)[6]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Soumili Biswas Tollyworld profile". Tollyworld website. Archived from the original on 23 June 2013. Retrieved 1 March 2022.
- ↑ "Interview: Danseuse-Actress Soumili Biswas (Teen Tanaya, Sudhu Tomake Chai, Kanchanbabu) talks about her career in Bengali films". WBRi. Archived from the original on 1 మార్చి 2022. Retrieved 1 March 2022.
- ↑ "Spotlight Soumili". 5 October 2007. Retrieved 1 March 2022.
- ↑ "Clean & Clear event at Jogamaya Devi College - Times Of India". archive.ph. 2013-01-03. Archived from the original on 2013-01-03. Retrieved 2022-03-01.
- ↑ "tollyworld.com/index.php?option=com_artist&controller=arti…". archive.ph. 2013-02-04. Archived from the original on 2013-02-04. Retrieved 2022-03-01.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Delhi, BestMediaInfo Bureau; May 24; 2021. "Zee Bangla launches 11th season of its dance reality show Dance Bangla Dance". www.bestmediaifo.com. Retrieved 2022-03-01.
{{cite web}}
:|last3=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)