స్కిప్పింగ్ రోప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్కిప్పింగ్ రోప్‌తో ఆడుతున్న ఇద్దరు అమ్మాయిలు.
వర్జీనియాలో పొడవైన తాడుతో స్కిపింగ్ ఆడుతున్న బాలుడు.
రోప్ స్కిప్పింగ్ ఆడుతున్న బాలుడు

దాటే తాడును ఆంగ్లంలో స్కిప్పింగ్ రోప్ అంటారు. స్కిప్పింగ్ అనగా దాటటం, అనగా దాటటం అనే ఆట కోసం వాడే తాడును దాటే తాడు అంటారు, ఈ తాడుతో ఆడే ఆటను త్రాడు ఆట (రోప్ స్కిప్పింగ్) అంటారు. త్రాడుఆటలో ఒకరు లేదా అంతకుమించి ఆటగాళ్ళు ఉంటారు. ఈ ఆటలో తాడును ఆటగాడు రెండు చేతులతో రెండు చివరలను పట్టుకొని తల మీదుగా, కాళ్ళ కిందుగా తాడు తిరుగునట్లుగా తిప్పుతూ ఆడుతుంటాడు. తాడును తాను తిప్పుతూ ఆడుతున్న వ్యక్తి తాడు తన కాళ్ళకు అడ్డుపడకుండా తాడు కాళ్ళ దగ్గరకి వచ్చేసరికి గంతులు వేస్తూ ఆడుతుంటాడు. ఈ విధంగా తాడును తన చుట్టూ ఎన్నిసార్లు త్రిప్పుకుంటాడో అతనికి అన్ని పాయింట్లు వచ్చినట్టు లెక్క. ఈ విధంగా ఆడుతున్నప్పుడు అతని కాళ్ళు లేదా తల తగిలి తాడు తిరగడం ఆగినట్లయితే అక్కడ ఆడుతున్న వ్యక్తి ఓడిపోయినట్లు లెక్క. ఒక్కొసారి ఆడుతున్న వ్యక్తి అలుపు తీర్చుకొనుటకు తనకు తాను ముందుగా తెలిపి ఆపుకున్నట్లయితే ఓడిపోయినట్టుకాదు (ఇతర ఆటగాళ్ళు ఒప్పుకున్నప్పుడు), ఒక్కొసారి అంతవరకు వచ్చిన పాయింట్లే లెక్కిస్తారు. తాడు ఒకరు తిప్పుతుంటే తిప్పుతున్న వ్యక్తితో పాటు మరొక వ్యక్తి కూడా కలిసి గెంతుతూ ఈ ఆటను ఆడుతారు. కొన్ని రకాల ఆటలలో త్రాడు తిప్పేది ఒకరు గంతులు వేస్తూ ఆడేది వేరొకరు. ఈ రకపు ఆటలలో ఒకరు లేదా అంతకుమించి ఆటగాళ్ళు ఒకేసారి పాల్గొంటారు.

ఒక్కొసారి ఈ ఆటలో కొంత సమయాన్ని ఇచ్చి ఆ టైమ్‌ లోపల ఎవరు ఎక్కువ పాయింట్లు సాధిస్తారో వారిని గెలిచినట్లుగా ప్రకటిస్తారు.

వ్యాయామంగా స్కిపింగ్[మార్చు]

స్కిప్పింగ్ అనేది జాగింగ్ లేదా సైకిల్ రైడింగ్ మాదిరిగానే హృదయనాళ వ్యాయామంగా ఉపయోగించబడుతుంది. ఈ ఏరోబిక్ వ్యాయామం వలన గంటకు 700 నుండి 1200 కేలరీల వరకు ఖర్చవుతాయి, ప్రతి జంప్‌కు 0.1 నుండి దాదాపు 1.1 కేలరీలు వినియోగించబడతాయి. చాలా మంది ప్రొఫెషనల్ శిక్షకులు, ఫిట్నెస్ నిపుణులు, ప్రొఫెషనల్ యోధులు రన్నింగ్, జాగింగ్ వంటి ఇతర ప్రత్యామ్నాయ వ్యాయామాలు చేసి కొవ్వును కరిగించుకోవడం కన్నా స్కిపింగ్ ఆట ఆడుట మంచిదని సిఫార్సు చేస్తున్నారు.[1]

ఈ ఆట ఆడటం వలన వ్యక్తులు పొడవు పెరుగుతారు. ఈ ఆట ఆడేటప్పుడు మోకాళ్ళను ఎక్కువగా వంచుతారు, అందువలన కండరాలు విస్తరిస్తాయి, ఎముక ద్రవ్యరాశి కూడా పెరుగుతుంది, తద్వారా వ్యక్తులు కొంచెం పొడవుగా పెరుగుతారు.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Jumping rope is cheap, portable, and burns more calories than you might think". WebMD. Retrieved 2007-07-29.
  2. "Jumping Rope Will Make You Taller".