తాడు ఆట

వికీపీడియా నుండి
(త్రాడు ఆట నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తాడు ఆటాడుతున్న పిల్ల.

తాడు ఆట (Skipping) ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, పెద్దలు ఆడే ఆట మరియు ఒక రకమైన వ్యాయామం.

ఆడపిల్లలు దాదాపు తమ పొడవుగల తాడును చేతులతో తమకాళ్ల క్రిందనుంచి తలపైకిత్రిప్పుతూ, కాళ్లకు తగలకుండా గెంతుతుంటారు. అలా ఏకబిగిని ఎవరు ఎక్కువసార్లు త్రిప్పితే వారు గెలిచినట్లు.

దీనితోనే మరొక ఆట కూడా ఆడతారు. పిల్లలందరూ ఒకే చోట ఒకేసారి ఇలా గెంతుతూ బయలుదేరి నిర్దేశించుకున్న స్థలానికి ఎవరు ముందు చేరితే వాళ్ళు గెలిచినట్టు.

ఇది కాళ్ళకూ, చేతులకూ, ఏకాగ్రతకూ సంబంధించిన పరిశ్రమ. చక్కని పోటీ మనస్తత్వం, పురోగతిపై ఆకాంక్ష కలిగిస్తుంది ఈ ఆట.

మూలాలు[మార్చు]

  • గోదావరిసీమ జానపద కళలు క్రీడలు వేడుకలు, పడాల రామకృష్ణారెడ్డి, 1991, పేజీ: 397.
"https://te.wikipedia.org/w/index.php?title=తాడు_ఆట&oldid=2279139" నుండి వెలికితీశారు