Jump to content

గుజ్జన గూళ్ళు

వికీపీడియా నుండి
లక్కపిడతలు

ఇది కేవలం సంసారపు శిక్షణ ఇచ్చే ఆట. దీన్ని బువ్వలాట అని కూడా అంటారు. ఈ ఆటను పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో చిన్న పిల్లలు ఆడుకునేవారు. ఈ ఆటలో పిల్లలు ఎందరైనా పాల్గొనవచ్చును. పిల్లలు తమ పెద్దలనడిగి బియ్యము, పప్పులు, మరమరాలు, బెల్లం, పంచదార తెచ్చుకొని తాము ఆడుకొని లక్కపిడతల్లో (చెక్కతో చేయబడిన చిన్న వంట సామాగ్రి) పోసి వాటిని పొయ్యి మీద పెట్టినట్లు, దించినట్లు నటిస్తూ కొంతసేపటికి అందరూ కలిసి తింటారు. ఈ ఆట ఆడినప్పుడు బొమ్మల పెళ్ళి చేసి రెండు జట్లుగా చీలి వియ్యాలవారికి విందు పెట్టుటకై గుజ్జన గూళ్ళు పెడతారు. [1] బాగా పండిన చింతకాయలను తెచ్చి నేర్పుతో దానిలోని గుజ్జును గుల్ల చెడకుండా వుండునట్లు పూర్తిగా తీసివేసి, ఆ గుల్లలో బియ్యము పోసి, దానిని మండుచున్న పొయ్యిలోని కుమ్ములోని పెట్టి అవి ఉడికిన తరువాత ఆ పిల్లలు 'గుజ్జన గూళ్ళు' అని వేడుకగా తింటారు. ఈ గుజ్జన గూళ్ళు ఆటను రుక్మిణి, గరిక ఆడినట్లు భాగవతంలోను, మనుచరిత్రలోనూ ఉంది. [2]

నేటి పరిస్థితి

[మార్చు]
ఆధునిక కిచెన్ సెట్

ఆధునిక విద్య, ఆధునిక ఆటలు, ఉమ్మడి కుటుంబాల విచ్చిన్నం వల్ల ఈ ఆట నేడు దాదాపు పూర్తిగా అంతరించిపోయింది. భారతీయ సంప్రదాయాన్ని, కుటుంబ వ్యవస్థను ప్రతిబంబించే ఈ ఆట ఆధునిక సంస్కృతి ప్రభావానికి గురై మరుగున పడింది. గాజుల సత్యనారాయణ తన పెద్దబాల శిక్ష పుస్తకంలో గుజ్జన గూళ్ళు గురించి రాసాడు. ఇప్పటికీ బువ్వలాటలో వాడే లక్క పిడతలను విశాఖపట్నం జిల్లా ఏటికొప్పాకలో తయారుచేస్తారు. బువ్వాలట సామాన్లను నగరాల్లో జరిగే హస్త కళా ప్రదర్శనల్లో అమ్ముతారు.

మూలాలు

[మార్చు]
  1. "గుజ్జనగూళ్ళు | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Archived from the original on 2022-07-15. Retrieved 2022-07-15.
  2. పెద్దబాల శిక్ష - గాజుల సత్యనారాయణ, వనజ ఆప్ సెట్ ప్రింటర్స్, విజయవాడ