ఏడు పెంకులాట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఏడు పెంకులాట
Dabba Kali2.jpg
కేరళలో డబ్బా కలీ అనబడే ఏడుపెంకులాట
వయస్సు 4 ఆపై
ఆట సిద్ధం చేయటానికి సమయం నిమిషం కన్నా తక్కువ
ఆట ఆడే నిడివి అవధి లేదు
ఆటగాడిగా మారే అవకాశం తక్కువ
కావాల్సిన ప్రతిభలు పరిగెట్టటం, గమనించడం, వేగం, బలం, విసరటం

ఏడు పెంకులాట, లగోరి లేదా వీపువాపు అనేది దక్షిణ భారతదేశంలో ప్రముఖంగా ఆడబడే వీధి ఆట. రెండు జట్టుల మధ్య ఆడబడే ఈ ఆటలో ఏదు పెంకులు (నాపరాళ్ళ ముక్కలు) మరియు బంతితో ఆడతారు. ఒక జట్టుకు చెందిన ఒక వ్యక్తి బంతిని పెంకుల మీదకు విసిరి పడగొడతాడు. అలా పడవేసిన పెంకులను మళ్ళీ ఒకదానిమీద ఒకటి పేర్చాలి; ఇది ప్రత్యర్ధి జట్టు వారు బంతితో కొట్టే లోపు చేయాలి. పత్యర్ధి జట్టు వారు పెంకులు పేర్చే లోపు ఈ జట్టు వాళ్ళలో ఎవరినైనా బంతితో కొడితే, వారు గెలిచినటు; లేదా ఈ జట్టు వారు పేర్చేస్తే, వీరు గెలిచినట్టు.

అదనపు నిబంధనలు[మార్చు]

ఈ అదనపు నిబంధనలు ఆటలో మరింత ఆసక్తిని కలుగజేస్తాయి:

  • సీమను నిర్ణయించి సీమ దాటితే దొంగను చేయడం. దొంగ అంటే అతను ఆటకు పనికిరాడని, దొంగ అయిన వ్యక్తి మళ్ళీ తిరిగి ఆడాలంటే మరో ఆట కోసమయినా వేచి చూడాలి లేదా ఈ ఆటలో జట్టువాళ్ళు అంకెలు గెలిచి అతన్ని తిరిగి ఆటలోకి తీసుకోవాలి (బ్రతికించాలి).
  • మూడు అవకాశాల్లో ఏడు పెంకులు పడకపోతే దొంగను చేయడం.
  • బంతి పెంకులకు తగలకుండా మూడు అవకాశాల్లో ఒక్కసారయినా ప్రత్యర్థి టీం వాళ్ళ చేతికి ఒక గెంతుకి దొరికితే విసిరిన వ్యక్తి దొంగ.
  • బంతి పెంకులకు తగిలి, ఒక గెంతులోపే ప్రత్యర్థి జట్టు వాళ్ళు పట్టుకుంటే మొత్తం జట్టు ఓడిపోయినట్టు.
  • ఆడే జట్టు ఓడిపోకుండా పెంకులు సర్దితే వచ్చిన అంకెలతో దొంగను బ్రతికించుకొని జట్టులోకి కలుపుకోవచ్చు.

ఆటకారికి ఉండాల్సిన లక్షణాలు[మార్చు]

  • బంతిని విసరటం
  • బంతికి తగలకుండా తప్పించుకోవటం
  • పెంకులను పేర్చటం
  • ప్రత్యర్థులను తికమక పెట్టి పెంకులను పేర్చకుండా చేయటం

ఇతర పేర్లు[మార్చు]

దేశంలో అన్ని ప్రాంతల్లో ఈ ఆటను ఆడతారు. మహారాష్ట్రలో లింగోర్చ్య అనీ, హర్యాణా ఇంకా ఉత్తర రాజస్థాన్‍లో పిట్ఠు అనీ, మిగితా రాజస్థాన్‍లో సితోలియా ఇంకా గుజరాత్లో సతోడియు అని అంటారు. కేరళలో డబ్బాకలీ అని, తమిళనాట ఏఴు కళ్ళు అనీ అంటారు.కన్నడ వారు లగోరి అని అంటారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లంకెలు[మార్చు]