స్టాయికియోమెట్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మీథేన్ దహనచర్యకు సంబంధించిన స్టాయికియోమెట్రిక్ రేఖాచిత్రం

స్టాయికియోమెట్రీ అనేది ఒక రసాయన ప్రతిచర్య జరిగేటపుడూ, జరిగిన తర్వాత అందులో పాల్గొన్న కారకాలు, ఉత్పత్తుల బరువుల మధ్య సంబంధాన్ని సూచించేది.

స్టాయికియోమెట్రీ ద్రవ్యనిత్యత్వ నియమం ఆధారంగా ఏర్పడింది. ఈ నియమం ప్రకారం ఒక ప్రతిచర్యలో పాల్గొనే కారకాల ద్రవ్యరాశి మొత్తం, దాని ద్వారా ఏర్పడ్డ ఉత్పత్తుల ద్రవ్యరాశుల మొత్తానికి సమానం. దీని నుంచి ప్రతిచర్యలో పాల్గొనే కారకాలు, ఉత్పత్తుల పరిమాణాల నిష్పత్తి ధన సంఖ్యల రూపంలో సూచించవచ్చు.

బొమ్మలో చూపించిన దానిని సమీకరణ రూపంలో ఇలా సూచించవచ్చు.

CH4 + 2 O2 → CO2 + 2 H2O

పద వ్యుత్పత్తి

[మార్చు]

స్టాయికియోమెట్రీ అనే పదాన్ని మొదటగా జెరిమయాస్ బెంజమిన్ రిక్టర్ 1792 లో రాసిన పుస్తకంలో మొదటిసారిగా వాడాడు. ఈ పదం పురాతన గ్రీకు పదాల ఆధారంగా ఏర్పడింది. దీని ప్రకారం స్టాయికియోన్ అంటే మూలకం అని అర్థం.[1] మెట్రాన్ అంటే గణించడం అని అర్థం.

మూలాలు

[మార్చు]
  1. Sinnott, R. K. (2005). Coulson and Richardson's Chemical Engineering (4th ed.). Amsterdam Paris: Elsevier Butterworth-Heinemann. p. 36. ISBN 978-0-7506-6538-4.