Jump to content

స్టెమోనేసి

వికీపీడియా నుండి

స్టెమోనేసి
హెట్రోసపాల్ క్రోమియా
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
Order:
పాండాలాలు
Family:
స్టెమోనేసి

అడోల్ఫ్ ఎంగ్లర్

స్టెమోనేసి (Stemonaceae) పుష్పించే మొక్కల కుటుంబం. దీనిలో 3-4 ప్రజాతులు, వాటిలో 25-35 జాతులూ ఉన్నాయి.[1]

వివరణ

[మార్చు]

దీని కాండం ఆకుపచ్చ, పసుపు-ఆకుపచ్చ లేదా కొన్నిసార్లు ఎరుపు రంగులో నిటారుగా గానీ, వెనుకకు వంగి గానీ ఉంటాయి. వీటి ఆకులు చాలావరకు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. మొక్క దిగువ భాగాల నుండి చిన్న సైమ్‌లుగా పువ్వులు ఉద్భవిస్తాయి. దీని విత్తనాలు దీర్ఘవృత్తాకార లేదా గోళాకార ఆకారంలో ఉంటాయి.

పాండనేల్స్‌లోని ఇతర మొక్కల జాతుల మాదిరిగానే, స్టెమోనేసిలోని పుష్పం ఏకదళబీజాలకు భిన్నంగా ఉంటుంది. దీని పూల నిర్మాణ శాస్త్రం మూడు-భాగాలు (ట్రైమెరస్). స్టెమోనేసి జాతులలో ఎక్కువ భాగం, పువ్వులు నాలుగు భాగాలు ఉంటాయి. వీటిలోటెట్రా మెరస్, లేదా కొన్నిసార్లు డై మెరస్ (రెండు-భాగాలు). [2] దీనికి నాలుగు కేసరావళులు ఉంటాయి. చాలా మొక్కలలో టెపల్స్ (రేకలు, రక్షక పత్రాలు (sepals) మధ్య తేడా లేనివి) నాలుగు ఉంటాయి. అవి నునుపుగా పాపిల్లేట్‌గా ఉంటాయి.[3]పెంటాస్టెమోనాలో, పువ్వులు పెంటా మెరస్ (ఐదు-భాగాలు), కేసరావళి సంఖ్య ఐదు ఉంటాయి. మైక్రోస్పోరోజెనిసిస్ వరుసగా ఉంటుంది. చాలా ఏకదళబీజాల మాదిరిగానే ఈ పూల ఊదా, మెరూన్, ఆకుపచ్చ లేదా పసుపు రంగులలో ఉంటాయి. అవి కారియన్‌ను (కుళ్ళిన మాంసం వాసనను) పోలి ఉండటం ద్వారా పరాగ సంపర్కాలను ఆకర్షిస్తాయి, కొన్నిసార్లు ఇలాంటి వాసనను కూడా వెదజల్లుతాయి. పువ్వులను సందర్శించే ఈగలు పరాగ సంపర్కాలుగా పనిచేస్తాయి.[4]

ఉపయోగాలు

[మార్చు]

ఈ కుటుంబంలోని మొక్కలు వివిధ చికిత్సాలకు, ఇతర ఉపయోగాలకు ఉపయోగిస్తారు. వీటిని చైనా, లావోస్, జపాన్, థాయిలాండ్, ఇతర ప్రదేశాలలో ఎక్కువగా వాడుతారు. [5] వీటిలో కొన్ని రకాలను పురుగుమందుల తయారీకి ఉపయోగిస్తారు. లావోస్‌లో, ప్రజలు వాటిని ఈగలు, పేనులకు మందుగా కషాయాన్ని తయారు చేస్తారు. ఈ మొక్కలను చేప విషం తయారీకి ఉపయోగిస్తారు. వాటి యాంటీ బాక్టీరియల్, యాంటీటస్సివ్, యాంటీ ఫంగల్, ఊపిరితిత్తుల లేదా చర్మ వ్యాధులకు మందుగా దీనిని జానపద వైద్యంలో కూడా ఉపయోగిస్తారు.

మూలాలు

[మార్చు]
  1. ↑ Nash, C.; Peters, T. (2012-08-02). "ANALYSES OF HTF-48-12-20/24 (FEBRUARY, 2012) AND ARCHIVED HTF-E-05-021 TANK 48H SLURRY SAMPLES". {{cite journal}}: Cite journal requires |journal= (help)
  2. ↑ "Angiosperm Families - Stemonaceae Engl". Archived from the original on 2006-02-02.
  3. ↑ Burgin, Jillian (2019-04-19). "Stormwater Pollution Prevention Plan, TA-60-02 Salvage/Warehouse, Revision 4: LANS Archived 2019". {{cite journal}}: Cite journal requires |journal= (help)
  4. ↑ Hutchinson, Pearse (1959). "Nonplus". Comhar. 18 (11): 16. doi:10.2307/20550683. ISSN 0010-2369.
  5. ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2014-12-20. Retrieved 2012-06-18.{{cite web}}: CS1 maint: archived copy as title (link)