స్టోయిసిజం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్టాయిసిజంకి ఆధ్యుడు జెనో ఆఫ్ సిటియం (Zeno of Citium), 1969 నాటి చిత్రం

స్టోయిసిజం అనేది సా.పూ 3వ శతాబ్దంలో పురాతన గ్రీకు దేశంలో ఏథెన్స్ నగరంలో ఆవిర్భవించిన తత్వశాస్త్ర భావన. జెనో ఆఫ్ సిటియం దీనికి ఆద్యుడు. ఈ భావనలు ప్రాచుర్యంలోకి తెచ్చిన వారిని స్టోయిక్స్ అని అంటారు.

ఈ భావన ప్రకారం ధర్మంతో (virtue) కూడిన జీవితమే మానవునికి ఉత్తమైన మార్గం. వేరే భౌతిక సంపత్తులైన ఆరోగ్యం, సంపద, సుఖం మొదలైనవి మంచివీ కాదు, చెడ్డవీ కాదు.[1]

స్టాయిసిజం పురాతన గ్రీకు, రోమన్ సామ్రాజ్యాలలో సా. శ 3 వ శతాబ్దం వరకూ పరిఢవిల్లింది. దీనిని అనుసరించిన వారిలో మార్కస్ ఓరీలియస్ (Marcus Aurelius) చక్రవర్తి ముఖ్యుడు. సా. శ 4 వ శతాబ్దంలో క్రైస్తవం రాజ్యమతం అయినప్పటి నుంచి దీని ప్రాబల్యం తగ్గిపోయింది. అయితే సాంస్కృతిక పునరుజ్జీవన కాలం నుంచి నియో స్టాయిసిజం పేరుతోనూ, ప్రస్తుతం ఆధునిక స్టాయిసిజం పేరుతోనూ పునరుత్తేజం పొందింది.[2]

స్టోయిసిజం విధ్వంసక భావోద్వేగాలను అధిగమించేందుకు స్వీయ-నియంత్రణ, ధైర్యాన్ని అభివృద్ధి చేసుకోమని బోధిస్తుంది. విశ్వభావనను అర్థం చేసుకోవడానికి స్పష్టమైన, నిష్పాక్షికమైన ఆలోచనాపరుడిగా మారమని ఈ తత్వం బోధిస్తుంది. ఈ తత్వం ప్రకారం మానవులంతా ఒకే విశ్వాత్మ నుంచి ఉద్భవించిన వారే కాబట్టి వాళ్ళందరూ సౌభ్రాతృత్వంలో మెలగాలి, ఒకరికొకరు సహాయం చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. సాంఘిక సంబంధాల్లో హోదా, ఆస్తులు మొదలైనవి అడ్డు కాకూడదని కూడా ఈ తత్వం బోధిస్తుంది.

పేరు

[మార్చు]

స్టోయిసిజాన్ని మొదట్లో ఈ భావనకు ఆద్యుడైన జెనో పేరు మీదుగా జెనోనిజం అనేవారు. అయితే కొద్ది కాలంలోనే ఆ పేరును మార్చేశారు, ఎందుకంటే ఈ తత్వశాస్త్రాన్ని అనుసరించే వారు ఆ వ్యవస్థకు పుట్టించిన వారితో సహా ఎవరైనా సంపూర్ణమైన వ్యక్తులు కాదని నమ్ముతారు. అలాగే తమ తత్వం కొంతమంది వ్యక్తులు స్థాపించిన సాంప్రదాయంగా మిగిలిపోకూడదని భావించారు.[3]

ఈ స్టోయిసిజం అనే పదం స్టోవా పికీలే (Stoa Poikile) అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. ఈ పదానికి అర్థం స్తంభాలతో ఏర్పాటు చేసిన వసారా లాంటిది. ఇది పురాతన ఏథెంస్ లో అగోరా అనే స్థలంలో ఉంది. ఇక్కడ జెనో, అతని అనుచరులు కూడి తమ భావనలు పంచుకుంటూ చర్చలు చేసేవారు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. Sharpe, Matthew. "Stoic Virtue Ethics Archived 2018-11-13 at the Wayback Machine." Handbook of Virtue Ethics, 2013, 28–41.
  2. Becker, Lawrence C. (2001). A New Stoicism. Princeton: Princeton University Press. ISBN 978-1400822447.
  3. Robertson, Donald (2018). Stoicism and the Art of Happiness. Great Britain: John Murray.
  4. "Definition of STOIC".
  5. Williamson, D. (1 April 2015). Kant's Theory of Emotion: Emotional Universalism. Palgrave Macmillan US. p. 17. ISBN 978-1137498106.