Jump to content

స్నేహలతా కోల్హే

వికీపీడియా నుండి
స్నేహలతా కోల్హే
స్నేహలతా కోల్హే


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - 2019 అక్టోబర్ 24
ముందు అశోకరావు శంకర్రావు కాలే
తరువాత అశుతోష్ అశోక్‌రావ్ కాలే
నియోజకవర్గం కోపర్‌గావ్

వ్యక్తిగత వివరాలు

జననం (1971-10-08)1971 అక్టోబరు 8 [1]
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి బిపిందాద శంకర్రావు కోల్హే
వృత్తి రాజకీయ నాయకురాలు

స్నేహలతా కోల్హే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కోపర్‌గావ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. స్నేహలతా కోల్హే మహారాష్ట్ర బిజెపి రాష్ట్ర కార్యదర్శిగా పని చేసి, కోపర్‌గావ్ నియోజకవర్గానికి మొదటి మహిళా శాసనసభ్యురాలిగా ఎన్నికైంది.

రాజకీయ జీవితం

[మార్చు]

స్నేహలతా కోల్హే భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కోపర్‌గావ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి అశుతోష్ అశోక్‌రావ్ కాలేపై 29,270 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె 99,763 ఓట్లతో విజేతగా నిలవగా, అశుతోష్ కాలేకి 70,493 ఓట్లు వచ్చాయి.[2][3] ఆమె 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి అశుతోష్ అశోక్‌రావ్ కాలే చేతిలో 822 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయింది.[4]

మూలాలు

[మార్చు]
  1. "Snehalata Bipindada Kolhe". Indialeader.
  2. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  3. "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
  4. "Kopargaon Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 17 December 2024. Retrieved 17 December 2024.