మధుమిత
మధుమిత | |
|---|---|
| జననం | స్వప్న మాధురి 20 ఆగస్టు 1981 |
| వృత్తి | నటి |
| క్రియాశీలక సంవత్సరాలు | 2002–ఇప్పటివరకు |
| భాగస్వామి | శివ బాలాజీ |
మధుమిత (జ. ఆగస్టు 20, 1981) ఒక నటి. ఆమె అసలు పేరు స్వప్న మాధురి. దక్షిణాది సినిమాలలో ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువగా సహాయ పాత్రలు పోషించింది. పుట్టింటికి రా చెల్లీ, మన్మథుడు లాంటి గుర్తింపదగ్గ పాత్రలు ధరించింది. ప్రముఖ నటుడు శివ బాలాజీ ని వివాహమాడింది.[1]
కెరీర్
[మార్చు]మధుమిత స్వప్నమాధురి అనే పేరుతో 2002 లో విడుదలైన సందడే సందడి అనే చిత్రంలో ముఖ్యమైన సహాయపాత్రతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించింది. తరువాత మన్మథుడు, అమ్మాయిలు అబ్బాయిలు, పుట్టింటికి రా చెల్లి లాంటి సినిమాలలో సహాయపాత్రలు చేసింది. అర్జున్ కు చెల్లెలుగా నటించిన పుట్టింటికి రా చెల్లీ సినిమా 275 రోజులు ఆడి సంచలన విజయాన్ని నమోదు చేసింది. [2]
తరువాత ఆమెను పార్తిబన్ కుడైకుళ్ మళై అనే సినిమాతో తమిళ సినీపరిశ్రమకు పరిచయం చేశాడు. ఈ సినిమాలో ఆమె కథానాయికగా నటించింది. ఆ పాత్ర పేరైన మధుమిత ను తన అసలు పేరుగా మార్చుకున్నది. ఆ సినిమా పెద్దగా విజయవంతం కాకపోయినా ఆమెను తమిళంలోనే మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఆముదే, ఇంగ్లిష్ కారన్ అనే తమిళ సినిమాల్లో నటించింది.
వివాహం
[మార్చు]శివ బాలాజీ, మధుమిత 2005లో తమిళ సినిమా ''ఇంగ్లీష్ కారణ్'' సినిమాలో వీరిద్దరు కలిసి నటించగా వీరి పరిచయం ప్రేమగా మరి 2009లో పెళ్లి చేసుకున్నారు.[3][4] వీరికి ఇద్దరు కుమారులు ధన్‌విన్, గగన్ ఉన్నారు.[5][6]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనికలు |
|---|---|---|---|---|
| 2002 | సందడే సందడి | మంజు | తెలుగు | స్వప్న మాధురిగా పేరుపొందారు |
| కలుసుకోవలని | అంజలి స్నేహితురాలు. | |||
| మౌనమెలనోయి | మౌనిక బంధువు | |||
| నువ్వే నువ్వే | శాంతి | |||
| రెండు గుండెల చప్పుడు | ||||
| మన్మధుడు | స్వప్న | |||
| 2003 | అమ్మాయిలు అబ్బాయిలు | రంజని | స్వప్న మాధురిగా పేరుపొందారు | |
| ధామ్ | శారద | |||
| 2004 | పుట్టింటికి రా చెల్లి | లక్ష్మి | స్వాతిగా పేరుపొందారు | |
| కుడైకుల్ మళై | మధుమిత | తమిళం | ||
| హుచ్చనా మడువేలి ఉందోనే జానా | భాగ్య | కన్నడ | స్వప్న మాధురిగా పేరుపొందారు | |
| 2005 | కీలు గుర్రం | తెలుగు | స్వప్న మాధురిగా పేరుపొందారు | |
| అముధే | నాన్సీ | తమిళం | ||
| బాయ్ ఫ్రెండ్ | లేఖ | మలయాళం | ||
| ఇంగ్లీష్కరన్ | సంధ్య | తమిళం | ||
| 2006 | నాలై | చారు | ||
| 2007 | ఆనివేర్ | సంధ్య | ||
| నాను నేను జోడి | గౌరి | కన్నడ | ||
| 2008 | అరై ఎన్ 305-ఇల్ కడవుల్ | మహిషాసురమర్ధిని (మహి) | తమిళం | |
| 2009 | సొల్ల సొల్ల ఇనిక్కుం | రాధిక | ||
| యోగి | రాజసులోచన | ఉత్తమ సహాయ నటిగా వికడాన్ అవార్డులు గెలుచుకుంది
ఉత్తమ సహాయ నటిగా విజయ్ అవార్డుకు ఎంపికైంది | ||
| 2011 | తూంగా నగరం | ప్రత్యేక ప్రదర్శన | ||
| కాదల్ మెయిపడ | ఐశ్వర్య | |||
| 2012 | ఊ కొడతారా? ఉలిక్కి పడతారా? | విశాలాక్షి | తెలుగు | |
| 2013 | బిర్యానీ | వరలక్ష్మి | తమిళం | |
| 2014 | మైనే ప్యార్ కియా | మాలతి | తెలుగు | |
| 2015 | భలే భలే మగాడివోయ్ | గాయత్రి | ||
| 2019 | వినయ విధేయ రామ | నందన | ||
| 2022 | టెన్త్ క్లాస్ డైరీస్ |
మూలాలు
[మార్చు]- ↑ "శివ బాలాజీ భార్య యూట్యూబ్ పెట్టడానికి ఆ బెదిరింపులే కారణమా ?". BigTvLive. 2 April 2025. Archived from the original on 1 June 2025. Retrieved 1 June 2025.
- ↑ "Having a ball". The Hindu. Chennai, India. 18 April 2008. Archived from the original on 9 నవంబరు 2012. Retrieved 19 మే 2016.
- ↑ "మధుమిత నిశ్చితార్థం". indiaglitz.com. Archived from the original on 26 ఆగస్టు 2008. Retrieved 19 July 2009.
- ↑ "జాతకాలు కుదరలేదని బ్రేకప్ చెప్పేసుకున్నాం..: శివ బాలాజీ". Eenadu. 8 June 2023. Archived from the original on 1 June 2025. Retrieved 1 June 2025.
- ↑ "శివబాలాజీ కుటుంబం".
- ↑ "శివబాలాజీకి సంబంధించిన వార్త". Archived from the original on 2015-04-03. Retrieved 2016-05-20.