స్వర్గలోకపు పక్షి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వర్గలోకపు పక్షి
Lophorina minor by Bowdler Sharpe.jpg
పరిరక్షణ స్థితి
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: Animalia
విభాగం: Chordata
తరగతి: Aves
క్రమం: Passeriformes
కుటుంబం: Paradisaeidae
జాతి: Lophorina
Vieillot, 1816
ప్రజాతి: L. superba
ద్వినామీకరణం
Lophorina superba
(Pennant, 1781)

స్వర్గలోకపు పక్షి లేదా సూపర్బ్ బర్డ్ ఆఫ్ పారడైజ్ ఒక రకమైన పక్షి. నల్లని శరీరం, దానిపై నెమలి కంఠం రెక్కలు, పైగా అవి మెరుపులు చిందిస్తాయి. వాటికి తోడు రంగు రంగుల ఈకలు... ఇవన్నీ 'సూపర్ బర్డ్ ఆఫ్ ప్యారడైజ్' పక్షి విశేషాలు. అందుకే దీన్ని స్వర్గలోకపు పక్షిగా పిలుస్తారు. ప్రపంచంలోని అందమైన పక్షుల జాబితాలో ఇదీ ఒకటి. దీన్ని చూడాలంటే న్యూగునియా అడవులకి వెళ్ల్లాలి.

విశేషాలు[మార్చు]

 • పదంగుళాల పొడవుండే వీటిల్లో మగవే చాలా అందంగా ఉంటాయి. ఇవి ఆడవాటిని ఆకర్షించడానికి చేసే విన్యాసాలు చాలా ఉంటాఅయి.
 • అవడానికి పక్షే అయినా దీని రూపం భిన్నంగా ఉంటుంది. వీటికి వెనక ఉండే నల్లని రెక్కలతో పాటు ప్రత్యేకంగా ముందు భాగంలో ఆకర్షించే నీలాకుపచ్చ రంగులో రెక్కల్లాంటివి ఉంటాయి. అదే రంగులో తలపై అటూ ఇటూ కిరీటంలా చిన్న రెక్కలుంటాయి. వెనకేమో నల్లని, మెరిసే ఈకలతో ఉన్న పెద్ద రెక్కలుంటాయి.
 • మగ, ఆడవాటి రంగుల్లో తేడా ఉంటుంది. మగవే అందమైనవి, ఆడవి కాస్త ముదురు గోధుమ రంగులో ఉంటాయి.
 • ఆడవాటిని వల్లో వేసుకోవడానికి మగవి గట్టిగా అరుస్తాయి. ఆడవి రాగానే ముందున్న రెక్కలు వెడల్పుగా చాచి, నెమ్మదిగా తలపైనున్న నీలం రంగు చిన్ని రెక్కలను పైకెత్తుతాయి. తర్వాత వెనుకున్న రెక్కలను కూడా పూర్తిగా విప్పుతాయి. అచ్చంగా నెమలిలా కనిపించడమే కాదు, ఆడవాటి చుట్టూ తిరుగుతూ లయబద్ధంగా నాట్యం కూడా చేస్తాయి. ఇలా చేస్తున్నపుడు ముందు నుంచి చూస్తే దీని రెక్కలన్నీ వెడల్పాటి పింఛంలా కనిపిస్తాయి.
 • తలపై ఉన్న చిన్ని రెక్కలు కళ్లలా, వాటి రూపమంతా కలిపి చూడ్డానికి కార్టూన్ బొమ్మ ముఖంలా కనిపిస్తుంది. అందుకే వీటిని ' స్మైలీ బర్డ్ ఆఫ్ ప్యారడైజ్' అని కూడా పిలుస్తారు.
 • ఇలాంటి అందమైన పక్షులన్నింటిని కలిపి 'బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్' అంటారు. అంటే స్వర్గ లోకపు పక్షులన్న అర్థము.
 • ఎక్కువగా న్యూగునియా అడవుల్లో ఉండే వీటిల్లో 43 జాతులుంటాయి.
 • వీటిల్లో మగవి ఎక్కువగా ఎత్తులో ఉండే చెట్లపై గడుపుతుంటాయి. ఆడవి మాత్రం ఎక్కువగా కిందే ఉంటాయి. ఎప్పుడో గానీ ఆడవి, మగవి కలుసుకోవు. చిన్న చిన్న కీటకాలు, పురుగుల్ని తింటూ బతికేస్తాయి.
 • పిల్లల బాధ్యత ఆడవాటిదే. గుడ్ల నుంచి ఇరవై రోజుల్లో పిల్లలు పుట్టుకొస్తాయి!
 • వీటి అందమైన రెక్కల కోసం ఎక్కువగా చంపేస్తున్నారు. దాంతో ఇప్పుడు అంతరించి పోయే దశకు చేరుకున్నాయి.

మూలాలు[మార్చు]

 1. BirdLife International (2012). "Lophorina superba". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. Retrieved 26 November 2013.

బయటి లంకెలు[మార్చు]