Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

స్వర్ణ సుబ్రహ్మణ్య కవి

వికీపీడియా నుండి

స్వర్ణ సుబ్రహ్మణ్య కవి (1901 - 1983) తెలుగు రచయిత.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

అతను ప్రకాశం జిల్లాలోని కోళ్ళపూడి గ్రామంలో కోటేశ్వరరావు, లక్ష్మమ్మ దంపతులకు 1901 సంవత్సరంలో జన్మించాడు. అతనికి ముగ్గురు కుమారులు: 1931లో విశ్వనాథాచారి, 1933లో వాచస్పతి, 1935 కోటేశ్వరరావులు జన్మించారు.అతని భార్య 1949లో పొన్నూరులోని అమెరికన్ ఆసుపత్రిలో ప్రసవమునకై చేర్చబడి మృతశిశువును జన్మనిచ్చి స్వర్గస్తురాలయ్యెను. అతను 1983లో పరమపదించారు.

రచనలు

[మార్చు]
  • విశ్వబ్రాహ్మణులకు ప్రథమ సత్కార అర్హత - వేద వాఙ్మయ పరిశోధనా గ్రంథము
  • పార్వతీ పరిణయము - హరికథ (1929)
  • ఆధ్యాత్మ వీరబ్రహ్మంగారి చరిత్రము (1934)
  • మహాకవి కందుకూరి రుద్రయ రచించిన నిరంకుశోపాఖ్యానము నకు సుధా తరంగిణీ వ్యాఖ్యానము
  • అమరుకావ్యమునకు తాత్పర్యము (1974)
  • ఈశ్వరమ్మగారి కాలజ్ఞానము (1979)
  • శ్రీ సనారీ విశ్వేశ్వరస్వామివారి మహిమలు (1979)
  • విశ్వకర్మ వ్రతకల్పము (1980, 1993)
  • భారతీయ మహాశిల్పము
  • మనుసూత్రము
  • యలవర్తి ఆంజనేయ శాస్త్రిగారి జీవితచరిత్ర
  • ఈశ్వరశతకము

మూలాలు

[మార్చు]