Jump to content

స్వాతంత్ర్య పథం

వికీపీడియా నుండి
స్వాతంత్ర్య పథం (లేదా స్వరాజ్య పథము)
కృతికర్త: గురజాడ రాఘవశర్మ
ముద్రణల సంఖ్య: 2
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: ఖండ కావ్యం
ప్రచురణ: బృందావన ప్రచురణలు
విడుదల: 1948-49

స్వాతంత్ర్య పథం ఖండకావ్యాన్ని గురజాడ రాఘవశర్మ రచించారు.

రచన నేపథ్యం

[మార్చు]

స్వాతంత్ర్య పథం గ్రంథం 1948-49లో తొలిముద్రణ పొందింది. బృందావన ప్రచురణలు సంస్థ వారు ఈ గ్రంథాన్ని ప్రచురించారు. 1978లో పునర్ముద్రితమైంది. ఈ ఖండకావ్యానికి తొలిముద్రణలో స్వరాజ్య పథము అన్న పేరుండగా, ద్వితీయముద్రణలో దానిని స్వాతంత్ర్య పథంగా మార్చారు.[1]

ఇతివృత్తం

[మార్చు]

స్వాతంత్ర్య సమరయోధుడు, కవి గురజాడ రాఘవశర్మ గాంధేయమార్గంలో స్వరాజ్యోద్యమంలో పాల్గొని, కవిగా, గాయకునిగా, బంధితుడిగా గడిపి గడపిన ముప్పై ఏళ్ల జీవితాన్ని, దేశ స్వాతంత్ర్య పోరాట గాథను ఇతివృత్తంగా స్వీకరించి రచించారు.

ఇతరుల మాటలు

[మార్చు]
  • ఈ చిన్నిపుస్తకము - దేశభక్తి - కవితాశక్తి - మనోరక్తి - అన్నింటికి ప్రకాశకము
- విశ్వనాథ సత్యనారాయణ, సుప్రతిష్ఠుడైన కవి, రచయిత, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత.[2]

మూలాలు

[మార్చు]
  1. విశ్వనాథ అసంకలిత సాహిత్యం-1(పీఠికలు):విశ్వనాథ సత్యనారాయణ:1995 సంకలనం
  2. స్వాతంత్ర్య పథం రచనకు విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిచ్చిన ఆశీస్సు