స్వాతిష్ట కృష్ణన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వాతిష్ట
ఒండు సరళ ప్రేమ కథె ప్రెస్ మీట్‌లో స్వాతిష్ట
జననం
స్వాతిష్ట కృష్ణన్
ఇతర పేర్లుస్వాతి
విద్యఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ
వృత్తి
  • నటి
  • టెలివిజన్ హోస్ట్
క్రియాశీల సంవత్సరాలు2017 – ప్రస్తుతం

స్వాతిష్ట కృష్ణన్ భారతీయ సినిమా నటి. ఆమె ప్రధానంగా తమిళం, కన్నడ భాషా చిత్రాలలో నటిస్తుంది.[1] ఆమె 2018 తమిళ చిత్రం సవరకతితో సపోర్టింగ్ రోల్‌లో తొలిసారిగా నటించింది.[2] ఆమె కీ (2019) చిత్రంలో అను పాత్రలో నటించి ప్రసిద్ధిచెందింది. 2021లో తెలుగు తెరపై కూడా గుండె క‌థ వింటారా చిత్రంతో కనువిందుచేసింది.[3]

కెరీర్

[మార్చు]

ఆమె బ్యాచిలర్స్ డిగ్రీ తర్వాత గోపి, సుధాకర్‌లతో కలిసి 2017లో విడుదలైన హాఫ్ బాయిల్ అనే మద్రాస్ సెంట్రల్ వెబ్ సిరీస్‌లో నటించింది. 2018లో, ఆమె తమిళ సినిమాలో అరంగేట్రం చేసింది. రామ్, షమ్నా కాసిమ్‌(పూర్ణ)లతో కలిసి సవరకతి చిత్రంలో ఆమె నటించింది. 2019లో జీవా సరసన కీ చిత్రంలోనూ, జడ (2019), విక్రమ్ (2022) వంటి చిత్రాలలో కూడా ఆమె నటించింది.[4] ఆమె 2021లో తెలుగు మ్యూజిక్ వీడియో ఎంత బావుందోలో చేసింది.[5] ఆమె పుతుయుగం టీవీలో కంపాస్ కౌంట్‌డౌన్ షోను హోస్ట్ చేసింది.[6]

2023లో, దర్శకుడు సునీ తన రాబోయే కన్నడ చిత్రం ఓండు సరళ ప్రేమ కథే చిత్రం కోసం ఆమెను ఎంచుకున్నాడు,[7]

మూలాలు

[మార్చు]
  1. "സ്വാതിഷ്ഠ കൃഷ്ണൻ - Swathishta Krishnan". www.manoramaonline.com. 2022-09-24. Retrieved 2023-04-02.
  2. "Lokesh taught me to act without any dialogues: Swathishta Krishnan". Times Of India. 2022-07-06. Retrieved 2023-04-02.
  3. Sakshi (22 April 2021). "గుప్పెడు గుండెను తట్టింది ఎవరో." Sakshi. Archived from the original on 3 జూలై 2021. Retrieved 3 July 2021.
  4. "Swathishta Krishnan and Chemban Vinod to play vital roles in Kamal Haasan's 'Vikram'". Times Of India. 2021-10-26. Retrieved 2023-04-02.
  5. "Swathishta pins hopes on two films". Times Of India. 2019-05-19. Retrieved 2023-04-02.
  6. "I enjoy anchoring, says swathishta". Times Of India. 2018-01-06. Retrieved 2023-04-02.
  7. "Swathishta foray into Sandalwood with Simple Suni's Vinay Rajkumar starrer". Times Of India. 2022-07-06. Retrieved 2023-04-02.