స్వాతి వర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వాతి వర్మ
జననం
స్వాతి వర్మ

జాతీయతభారతీయురాలు
వృత్తినటి, టెలివిజన్ ప్రెజెంటర్
క్రియాశీల సంవత్సరాలు2007-ప్రస్తుతం

స్వాతి వర్మ భోజ్‌పురి చిత్ర పరిశ్రమకు చెందిన భారతీయ నటి. అయితే, ఆమె భోజ్‌పురి చిత్రాలతో సహా తమిళం, మలయాళం, హిందీలలో కూడా నటించింది. ఆమె భోజ్‌పురి భాషా చిత్రాలలో అరంగేట్రం చేసి అత్యంత ప్రజాదరణ పొందింది.[1][2] తన మొదటి సినిమా ససురారి జిందాబాద్ తోనే ఆమె స్టార్‌డమ్‌ సాధించింది.[3] ఆమె ప్యాసి పట్నీ, మస్తానీ వంటి సినిమాలలో చిన్న పాత్రలను పోషించింది.

ప్రారంభ జీవితం

[మార్చు]

ఆమె ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందినది. అయితే, ఆమె జన్మస్థలం ముంబై. ఆమె తల్లిదండ్రులు వైద్యులు, 1970లలో కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ సేథ్ గోర్ధందాస్ సుందర్‌దాస్ మెడికల్ కాలేజ్ (కెఈఎం ఆసుపత్రి)లో పనిచేశారు. ఆ తర్వాత బిలాస్‌పూర్‌కి మారడంతో స్వాతి వర్మ రష్యా వెళ్ళింది. ఆమె అక్కడ ఇంటీరియర్ డిజైన్‌లో డిప్లొమా పూర్తిచేసింది. ఆమె కథక్ నృత్యకారిణి.[3]

కెరీర్

[మార్చు]

నటిగా కెరీర్ ప్రారంభించే ముందు ఆమె ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందింది. సహారా టెలివిజన్ ప్రసారం చేసిన ఏక్ దిన్ కి వర్ది సీరియల్‌లో ఆమె తొలిసారిగా నటించింది. తరువాత, ఆమె సోనీ సబ్ టీవి సురాగ్, దూరదర్శన్ నెట్‌వర్క్ ఆర్యమాన్ ధారావాహికలలోనూ నటించింది.[3]

ఫిల్మోగ్రఫీ (పాక్షికం)

[మార్చు]
సినిమా సినిమా భాష
2004 సింఫనీ మలయాళం
2005 మస్తానీ హిందీ
2007 ససురారీ జిందాబాద్ భోజ్‌పురి
2007 రసిక్ బల్మా భోజ్‌పురి
2009 బ్రహ్మదేవ తమిళం
2009 హమర్ రాజో దరోగా నం 1 భోజ్‌పురి
2010 ద్రోగం నడంతతు ఎన్నా తమిళం
2011 మట్టి భోజ్‌పురి
2012 కూటంచోరు తమిళం
2013 రోమన్స్ మలయాళం

మూలాలు

[మార్చు]
  1. "Swathi Varma filmography". Film Paradise, Chennai. Archived from the original on 14 March 2014. Retrieved 14 March 2014.
  2. "Showbitz". The Hindu. 28 October 2011.
  3. 3.0 3.1 3.2 "Meet the most popular Bhojpuri actress". Rediff news. 18 June 2007. Retrieved 14 March 2014.