స్వామి (1977 సినిమా)
స్వామి | |
---|---|
దర్శకత్వం | బసు ఛటర్జీ |
రచన | మను భండారి (మాటలు), బసు ఛటర్జీ (స్క్రీన్ ప్లే), శతర్ చంద్ర ఛటర్జీ (కథ) |
నిర్మాత | జయా చక్రవర్తి |
తారాగణం | షబానా అజ్మీ, విక్రమ్, గిరీష్ కర్నాడ్, ఉత్పల్ దత్ |
ఛాయాగ్రహణం | కె.కె. మహజన్ |
సంగీతం | రాజేష్ రోషన్, అమీత్ ఖన్నా (పాటలు) |
విడుదల తేదీ | 1977 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
స్వామి 1977లో విడుదలైన హిందీ చలనచిత్రం. 1949లో వచ్చిన బెంగాళీ సినిమా స్వామి అధారంగా బసు ఛటర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షబానా అజ్మీ, విక్రమ్, గిరీష్ కర్నాడ్, ఉత్పల్ దత్ తదితరులు నటించగా హేమా మాలిని, ధర్మేంద్ర అతిథి పాత్రల్లో కనిపించారు. దహిసార్, దహిసర్ నది పరివాహక ప్రాంతంలో దీనిని చిత్రీకరించారు.[1]
కథ
[మార్చు]"సౌదామిని" (షబానా అజ్మీ) సాహిత్యం ఉన్న మక్కువతో ఉన్నత విద్యను చదవాలనుకుంటున్న గ్రామీణ యువతి. తన ఆశయాన్ని మేనమాయ (ఉత్పల్ దత్) కూడా సమర్ధిస్తుంటాడు. కానీ సౌదామిని తల్లి (సుధా శివపురి)కి తన కూతురుకి పెళ్ళిచేయాలనుకుంటుంది. పక్కింట్లో ఉంటూ తన మేనమామకోసం కలకత్తా నుండి పుస్తకాలు తెచ్చిస్తున్న జమిందారు కుమారుడు నరేంద్ర (విక్రమ్) ని సౌదామిని ప్రేమిస్తుంది. కానీ, సమీప గ్రామానికి చెందిన గోధుమ వ్యాపారి "ఘన్శ్యామ్" (గిరీష్ కర్నాడ్) తో సౌదామిని ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం జరుగుతుంది. సౌదామినికి అత్తవారింట్లో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, ఆమె కొత్తఇంటిలో జీవితానికి అలవాటు పడటానికి ఎలా కష్టపడిందన్నది మిగతా సినిమా.
నటవర్గం
[మార్చు]- షబానా అజ్మీ (సౌదామిని మిని)
- గిరీష్ కర్నాడ్ (ఘన్‌శ్యామ్)[2]
- ఉత్పల్ దత్ (మిని మేనమామ)
- విక్రమ్ (నరేంద్ర నరేన్)
- సుధా శివపురి (మిని తల్లి)
- శశికళ (ఘన్‌శ్యామ్ మారు తల్లి)
- ప్రీతి గౌంగూలి (చారు దేవి)
- హేమా మాలిని (డ్యాన్సర్, అతిథి పాత్ర)
- ధర్మేంద్ర (డ్యాన్సర్, అతిథి పాత్ర)
సాంకేతికవర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బసు ఛటర్జీ
- నిర్మాత: జయా చక్రవర్తి
- కథ: శతర్ చంద్ర ఛటర్జీ
- మాటలు: మను భండారి
- సంగీతం: రాజేష్ రోషన్
- పాటలు: అమీత్ ఖన్నా
- ఛాయాగ్రహణం: కె.కె. మహజన్
అవార్డులు
[మార్చు]గెలుపొందినవి
[మార్చు]- 1977: ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమాగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం
- 1978: ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డు - షబానా ఆజ్మీ
- 1978: ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు అవార్డు - బసు ఛటర్జీ
- 1978: ఫిలింఫేర్ ఉత్తమ కథా రచయిత అవార్డు - శరత్ చంద్ర ఛటర్జీ
నామినేట్ అయినవి
[మార్చు]- 1978: ఫిలింఫేర్ ఉత్తమ చిత్రం అవార్డు
- 1978: ఫిలింఫేర్ ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు - రాజేష్ రోషన్
- 1978: ఫిలింఫేర్ ఉత్తమ గాయకుడు అవార్డు - కె. జె. ఏసుదాసు (కా కరూన్ సజ్నీ ఆయే నా బాలం)[3]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu, Friday Review (31 July 2014). "Swami (1977)". Vijay Lokpally. Archived from the original on 2018-06-14. Retrieved 26 June 2019.
- ↑ The Hindu, Movies (10 June 2019). "Girish Karnad — actor with a conscience". Namrata Joshi. Archived from the original on 10 June 2019. Retrieved 26 June 2019.
- ↑ "Fimfare Awards and Nominations" (PDF). Archived from the original (PDF) on 2009-06-12. Retrieved 2019-06-26.