స్వైన్ ఫ్లూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వైన్ ఫ్లూ అనేది ఒక ఇన్ఫ్లుంజా మహమ్మారి. హెచ్1ఎన్1 వైరస్ కలిగిన రెండు ప్రమాదకరమైన వ్యాధిల్లో ఒకటి. ఏప్రిల్ 2009లో మొట్టమొదటి సారిగా మనిషిలో ఈ వ్యాధిని కనుగొన్నారు. హెచ్1ఎన్1 వైరస్ కొత్త రూపం తీసుకున్నదే స్వైన్ ఫ్లూ. అంతకు ముందు ఉన్న పక్షి, పంది, మనిషుల ఫ్లూ వైరస్ లు యురేషియన్ పంది ఫ్లూ వైరస్ లు[1] కలిపితే వచ్చిన కొత్తరకం వైరసే స్వైన్ ఫ్లూ.[2]

మిగిలిన ఫ్లూల  మాదిరిగా కాక హెచ్1ఎన్1 60ఏళ్ళు పైబడిన వృద్ధులకు సోకదు. ఇది ఈ వైరస్ కు ముఖ్యమైన, విలక్షణమైన లక్షణం.[3] అంతకుముందు చాలా ఆరోగ్యవంతంగా ఉన్నవారికైనా చిన్నగా సోకితే దానిని న్యుమోనియా గా గానీ, ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్  సిండ్రోంగా పెంచుతుంది. దీని తరువాత శ్వాస తీసుకోవడంలో  ఇబ్బందిగా మారుతుంది. ఎక్కువగా 3-6 రోజుల్లో ఈ ఫ్లూ లక్షణాలు బయటపడతాయి.[4][5] ఈ ఫ్లూ వల్ల వచ్చిన న్యుమోనియా ఒకోసారి డైరెక్ట్ వైరల్ న్యుమోనియాగానీ, సెకండరీ బాక్టీరియల్ న్యుమోనియాగా గానీ మారచ్చు. 2009లో న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన దీని గురించి వివరిస్తూ, స్వైన్ ఫ్లూ సోకిన వారి ఊపిరితిత్తుల ఎక్స్ రేలో న్యుమోనియా గుర్తిస్తే యాంటీ వైరస్, యాంటీ బయోటిక్స్ రెండూ వాడాలని సూచించారు.[6] ఫ్లూ సోకిన వ్యక్తి కోలుకుంటున్న సమయంలో తిరిగి అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతతో జ్వరం వస్తే బ్యాక్టీరియల్ న్యుమోనియా తిరిగి వచ్చేందుకు సంకేతంగా తెలుసుకోవాలి.

మూలాలు[మార్చు]

  1. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1055: attempt to compare nil with number.
  2. From Caleb Hellerman CNN (11 June 2009). "Swine flu 'not stoppable,' World Health Organization says". CNN. Retrieved 3 April 2010.
  3. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1055: attempt to compare nil with number.
  4. "Clinical features of severe cases of pandemic influenza". Geneva, Switzerland: World Health Organization (WHO). 16 October 2009. Archived from the original on 25 October 2009. Retrieved 25 October 2009.
  5. Rong-Gong Lin II (21 November 2009). "When to take a sick child to the ER". Los Angeles Times. Archived from the original on 25 November 2009. Retrieved 4 January 2010.
  6. Empty citation (help)