Jump to content

హబర్ శిలాజరాయి

వికీపీడియా నుండి

భారతదేశం లోని రాజస్థాన్ రాష్ట్రంలో జైసల్మేర్ జిల్లాకు నలభై కిలోమీటర్ల దూరంలో వున్న హబర్ అనే గ్రామంలో దొరకే ఒకరకపు గోధుమరంగు సున్నపు రాయి కాలిగ్రాఫిక్ బొమ్మలులా కనిపించే ఉపరితలంతో ప్రత్యేకంగా కనిపించడమే కాక వేడి చేసిన పాలలో కలిపితే వేరే మజ్జిగ పె==రుగు లాంటి పదార్ధాలు తోడు కలపకుండానే వాటిని పెరుగుగా మార్చుతుంది[1].ఈ ప్రత్యేకతలు ఆ రాయి శిలాజ రకానికి చెందటం వల్ల దానిలోని కొన్ని రకాల సూక్ష్మజీవుల వల్ల సాధ్యపడుతోంది అని శాస్త్రవేత్తలు నిర్దారించారు.[2] ఇప్పుడు ఆ గ్రామం పేరుమీదుగా రాయిని హబర్ రాయి అి పిలుస్తున్నారు.[3]

హబర్ రాయి నిర్మాణం

[మార్చు]

కోట్లాది సంవత్సరాల క్రిందటి సముద్రం అంతరించి ఇప్పటి నేలగా ఏర్పడిన ప్రాంతంలో పురాతన కాలం నాటి శిలాజాల అవశేషాలను మిగుల్చుకున్న రాయిగా ఇది ప్రత్యేకతలను కలిగి వున్నది. క్రెటేషియస్ ఆప్టియన్ రకపు శిలల వయసు 125 -112 మిలియన్ సంవత్సరాలవిగా గుర్తించారు అంటే పన్నెండున్నర కోట్ల నుంచి పదకొండు కోట్ల సంవత్సరా క్రితం నాటివి. ఈ గోధుమ రంగు, ఫెర్రుగినస్ క్లే బేరింగ్ సున్నపురాయిలో అనేక సూక్ష్మశిలాజాలు వున్నట్లు గమనించారు.

ప్రత్యేకతలు

[మార్చు]

ఎడారి ఇసుక నేలల రాజస్థాన్ రాష్ట్రంలో, జైసల్మేరే ఒక జిల్లా దానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న గ్రామం పేరు హబర్ (27 ° 19 ¢ N: 70 ° 33 ¢ E). ఈ ప్రాంత ప్రజలు అక్కడ దొరకే సున్నపు రాతిని రెండు కారణాలతో ప్రత్యేకంగా గమనించారు.

  • ఒకటి దాన్ని దగ్గరగా చూస్తే దేవుడి రాతలు అని వాళ్లకు అనిపించే కాలి గ్రఫీ టెక్ఛర్ దానిపై స్పష్టంగా కనిపిస్తూ వుండేది.
  • మరొకటి వాళ్ళు మహత్తుగా భావించిన విషయం ఆ రాయిని కాగబెట్టిన పాలలో వేస్తే అవి వేరే మజ్జిగ పెరుగు లాంటి తోడు కలపకుండానే కొంత సేపటికి పెరుగుగా మరేవి.

హబర్ రాయి పేరుతో మోసాలు

[మార్చు]

హబర్ రాయి కున్న పాలనుంచి పెరుగు ప్రత్యేకతలపై వున్న క్రేజు ను సొమ్ముచేసుకునేలా అనేక మోసాలు కూడా జరుగుతున్నాయి. హబర్ రాయి వంటి రాయితో పాత్రలు తయారు చేసి పరీక్షసమయంలో చూసే వారికి తెలియకుండా పెరుగు కలిపి తోడుకునేలా చేసి ఎక్కువ రేటుకు అంటగడుతున్నారు. [4]

ప్రత్యేకతలకు కారణం

[మార్చు]

శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ క్రెటేషియస్ ఆప్టియన్ రకపు శిలల వయసు 125 -112 మిలియన్ సంవత్సరాలవిగా గుర్తించారు అంటే పన్నెండున్నర కోట్ల నుంచి పదకొండు కోట్ల సంవత్సరా క్రితం నాటివి. ఈ గోధుమ రంగు, ఫెర్రుగినస్ క్లే బేరింగ్ సున్నపురాయిలో అనేక సూక్ష్మశిలాజాలు వున్నట్లు గమనించారు. వీటివల్ల ఆ రాతిలో అనేక కాలిగ్రాఫిక్ రాతలు లాగా అనిపించే నిర్మాణాలు కనిపిస్తున్నట్లు తేల్చారు.

ఇక పోతే పాలు పెరుగు కావడం విషయంలోకి వస్తే మనం పెరుగుని తోడు వేస్తున్నాం అనుకుంటాం కానీ పాల నిర్మాణంలో మార్పులు చేయగల బాక్టీరియాను దానిలో కలుపుతున్నాం. కానీ పెరుగును తయారుచేసుకునే మొదటి రోజుల్లో ఈ పద్దతి మాత్రమే కాకుండా అనేక ఇతర మార్గాలను కూడా ఉపయోగించేవారు. మనిషి పెరుగుని కనుక్కుని కనీసం మూడువేల సంవత్సరాలు అవుతుంది. దీని తయారీలో క్లిష్టమైన ప్రోటీన్ శృంఖలాలు(గొలుసులు) ఏర్పడటం అనే పద్దతి వుంది. బాగా మరగబెట్టిన పాలలో కాల్షియం నిల్వల శాతం పెరిగి అది అనేక దగ్గరి శృంఖల నిర్మాణాలుగా మారి పెరుగుగా రూపొందటం నుంచి ఎండుమిర్చి , చింతపండు లాంటి వాటిలోని బాక్టీరియాలను వాడి పాలను పెరుగుగామార్చడం ఇప్పటికీ పల్లెలలో మనం గమనిస్తూనే వుంటాం. జున్నుపాల తయారీ కోసం జున్నులో పదే పదే నానబెట్టి ఆరబెట్టిన వస్త్రపు ముక్కను కాచి చల్లార్చిన పాలలో వేయడం ద్వారా జున్ను పొందడం అనేది కూడా మనకు తెలుసు. ఆ గుడ్డలో మిగిలిన జున్నుకు కారణమైన బాక్టీరియా మళ్ళీ తగు ఉష్టోగ్రత వద్ద పాలలో కలిసినప్పుడు కుటుంబాలు పెంచుకుని కాలనీలుగా వృద్ది చెంది మొత్తంగా పాలను జున్ను లేదా పెరుగు రూపంలోకి రద్దీ సిటీగా మర్చేస్తాయి. అదే విధంగా ఈ శిలాజ రాయిలో వున్న విపరీతమైర రంధ్రాలు స్పాంజి రంధ్రాలను పోలి వుంటాయి. అవి అనేక సూక్ష్మజీవులకు ఆవాసం అవుతున్నాయి. వాటిలో పెరిగే ఒకరకం బాక్టీరియా పాలను తోడుకునేలా చేస్తున్నదా లేక వాటిలోని ఈ రాయిలో అమైనో ఆమ్లాలు, ఫినైల్ అలీనియా, రిఫ్టాఫెన్ టైరోసిన్ లాంటి రసాయనాలు పాలు నుండి పెరుగు తయారీకి సహాయపడతున్నాయా అనేది పరిశీలిస్తున్నారు.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2006-03-21. Retrieved 2020-07-14. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  2. Ranawat, Pushpendra. "Can Habur Limestone Curdle Milk?" (in ఇంగ్లీష్). Retrieved 14 July 2020.
  3. "What is the name of the stone which can convert milk into curd? - Quora". www.quora.com. Retrieved 14 July 2020.
  4. "Magical Yellow Stone Glasses from Jaisalmer for making Curd from Milk".

బయటి లింకులు

[మార్చు]